సాధారణంగా కటౌట్ అంటే థియేటర్ల ముందు స్టార్ హీరోలకు కట్టడం చూస్తాము. కానీ ఇప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోసం అభిమానులు భారీ కటౌట్ కి ప్లాన్ చేశారని తెలుస్తుంది. అది కూడా మన హైదరాబాద్ లో
దేశంలో సినిమాకి క్రికెట్ కి ఉండే క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి స్టార్ అయితే వీరిపై చూపించే అభిమానం ఆకాశాన్ని దాటేస్తుంది. వారికి నచ్చిన క్రికెటర్ మ్యాచ్ ఆడుతున్నడని తెలిస్తే గ్రౌండ్ నిండిపోతుంది. ఇక థియేటర్లలో సినిమా రిలీజ్ అయితే ఫుల్ హౌస్ అయిపోతుంది. అభిమానులు ఒక్కో స్టయిల్లో వారి అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇపుడు ఒక క్రికెటర్ కి భారీ కటౌట్ కడుతుండడం ఆసక్తికరంగా మారింది. అది కూడా మన హైదరాబాద్ లో. సాధారణంగా కటౌట్ అంటే థియేటర్ల ముందు స్టార్ హీరోలకు కట్టడం చూస్తాము. కానీ ఇప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోసం అభిమానులు భారీ కటౌట్ కి ప్లాన్ చేశారని తెలుస్తుంది.
టీమ్ ఇండియా కెప్టెన్, స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్నాడు. రోహిత్ కి ఫాలోయింగ్ గురించి మనకు తెలిసిందే. తన ఆట తీరుతో దేశవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడు. అయితే ముంబైకి చెందిన రోహిత్ శర్మకి హైదరాబాద్ లో ప్రజలు ఇంతలా అభిమానం చూపించడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. దీనికి కారణం లేకపోలేదు. గతంలో హిట్ మ్యాన్ డెక్కన్ చార్జర్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. అప్పట్లో అంతగా అంచనాలు లేని రోహిత్ శర్మ బాగా రాణించాడు. కారణం ఏదైనా కానీ ఇప్పుడు రోహిత్ శర్మకి భారీ కటౌట్ కట్టాలని అభిమానులు భావిస్తున్నారు.
ఇందులో భాగంగా హిట్ మ్యాన్ కి 60 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటుకి చేస్తున్నారు. ఏప్రిల్ 30 న రోహిత్ శర్మ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేయడం విశేషం. క్రికెటర్లలో ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. 2019 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ మీద రోహిత్ శర్మ సెంచరీ చేసి సెలబ్రేట్ చేసుకున్న ఫోజ్ ని భారీ కటౌట్ గా మలుస్తున్నారు. రోహిత్ తన పుట్టిన రోజున రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ముంబై జట్టుకి కెప్టెన్ గా ఉంటున్న రోహిత్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. మరి హైదరాబాద్ అభిమానులు చూపించే ప్రేమ రోహిత్ దగ్గరకు చేరుతుందో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Rohit sharma birthday preparations by the fans, begin with the 60 ft cutoff at Hyderabad 🔥.#HitmanCutoutAtHyderabad pic.twitter.com/QMtIwno3aD
— Mufaddal Vodra (@mufaddal_vodra) April 27, 2023