16 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో నమ్మశక్యం కాని రికార్డు నమోదు అయ్యింది. ఆ రికార్డు ఏంటంటే?
2023 ఐపీఎల్ సీజన్ దుమ్మురేపుతోంది. ప్రతి మ్యాచ్ ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను అందిస్తోంది. ఇక రికార్డుల సంగతి సరేసరి. ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక రికార్డు నమోదు అవుతూనే ఉంటుంది. అయితే కొన్ని రికార్డులు మాత్రం నమ్మశక్యంగా ఉండవు. అలాంటి రికార్డే ఒకటి తాజాగా నమోదు అయ్యింది. గత 16 ఏళ్ల ఐపీఎల్ సీజన్లలో ఇలాంటి రికార్డు ఇంతవరకు నమోదు కాలేదు. ఇంతకీ ఆ ఘనత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
16 ఏళ్ల IPL చరిత్రలో ఓ అరుదైన ఘనత నమోదు అయ్యింది. అయితే ఘనత సాధించింది ఏ ఒక్క క్రికెటరో కాదు. అందరు కలిసి ఈ అద్భుతమైన రికార్డును నెలకొల్పారు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే? ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు 27 మ్యాచ్ లు జరగగా.. 27 మంది వేర్వేరు ఆటగాళ్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నారు. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇక గతంలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదు. అయితే ఇలా వేర్వేరు ఆటగాళ్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకోవడం అభిమానులను సంతోషానికి గురిచేస్తోంది. ఒక్కో మ్యాచ్ లో ఒక్కో ఆటగాడు సత్తా చాటడంతో.. ఇలా అవార్డులు వస్తున్నాయి. అయితే ఇది ఐపీఎల్ టోర్నీకే కాక క్రికెట్ వరల్డ్ కు కూడా శుభపరిణామం అని విశ్లేషకులు చెబుతున్నారు. మరి 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి రికార్డు నమోదు అవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.