కెప్టెన్ రోహిత్ శర్మకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్. ఐపీఎల్ 1000వ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ గెలవడంతో పాటు ఓ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడదే ఇంట్రెస్టింగ్ మారిపోయింది.
ఐపీఎల్ 1000వ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ గెలిచింది. అసలు అసాధ్యం అనుకున్నారు. కానీ టిమ్ డేవిడ్.. చివరి ఓవర్ లో ఏకంగా హ్యాట్రిక్ సిక్సులు కొట్టి విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో కెప్టెన్ రోహిత్ శర్మకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ కూడా ఇచ్చారు. దీంతో ముంబయి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇదంతా పక్కనబెడితే.. ఎంతో ప్రత్యేకమైన ఈ మ్యాచ్ లో ముంబయి జట్టు ఎవరికీ సాధ్యం కాని సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం ఇది కాస్త క్రికెట్ ప్రేమికుల మధ్య హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?
అసలు విషయానికొస్తే.. వాంఖడేలో ముంబయి ఇండియన్స్ మ్యాచ్ ఉందంటే చాలు.. ఆ జట్టు ఫ్యాన్స్ తోపాటు క్రికెట్ లవర్స్ అందరూ ఆ మ్యాచ్ ని తెగ ఎంజాయ్ చేస్తారు. ముంబయి అలా ఆడేది. కానీ ఈ సీజన్ లో ఎందుకో తడబడుతూ, తప్పటడుగులు వేస్తోంది. గత రెండు మ్యాచుల్లో ఓడిన ముంబయి.. ఈసారి మాత్రం ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మకు విజయాన్ని పుట్టినరోజు బహుమతిగా ఇచ్చింది. అదే ఊపులో ఏకంగా ఓ సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. యశస్వి జైస్వాల్ (124) విధ్వంసం దెబ్బకు 212/7 భారీ స్కోరు చేసింది. ముంబయి 19.4 ఓవర్లలోనే దీన్ని ఛేదించింది. వాంఖడేలో ఇప్పటివరకు చాలా మ్యాచ్ లు జరిగాయి కానీ 200 కంటే ఎక్కువ టార్గెట్ ని ఏ జట్టు దాటలేకపోయింది. ఫర్ ది ఫస్ట్ టైమ్.. ముంబయి ఇండియన్స్, అది కూడా ఐపీఎల్ లోనే ప్రత్యేకమైన 1000వ మ్యాచ్ లో దీన్ని నమోదు చేసింది. అంతా బాగానే ఉంది కానీ ఈ మ్యాచ్ లో రోహిత్ కేవలం 3 పరుగులకే ఔటైపోవడం.. ఫ్యాన్స్ ని తెగ బాధపెట్టింది. సరే ఇదంతా వదిలేస్తే.. ముంబయి సరికొత్త రికార్డు నమోదు చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
IPL game number 1️⃣𝗞. The finish, 2️⃣4️⃣𝗞. 🤌 🥳#OneFamily #MIvRR #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 @timdavid8 @TilakV9 pic.twitter.com/4DdFTKf0u9
— Mumbai Indians (@mipaltan) April 30, 2023