క్రికెట్ లో ఎన్ని లీగ్ లు ఉన్నా ఐపీఎల్ క్రేజ్ వేరు. గత 15 సంవత్సరాలుగా ఈ లీగ్ విజయవంతంగా కొనసాగుతూ వస్తుంది. 2008 లో తొలిసారి ఈ మెగా లీగ్ కి శ్రీకారం చుట్టగా ఇప్పటివరకు ఏ మాత్రం పాపులారిటీ తగ్గకపోవడం ఐపీఎల్ స్పెషాలిటీని తెలియజేస్తుంది. ఇప్పటివరకు ఎన్నో రికార్డులు సృష్టించిన ఐపీఎల్ ప్రస్తుతం ఒక చారిత్రాత్మక ఘనత అందుకునేందుకు సిద్ధంగా ఉంది. . ఇప్పటివరకు ఎన్నో రికార్డులు సృష్టించిన ఐపీఎల్ ప్రస్తుతం ఐపీఎల్ ఒక చారిత్రాత్మక ఘనత అందుకునేందుకు సిద్ధంగా ఉంది.
క్రికెట్ లో ఎన్ని లీగ్ లు ఉన్నా ఐపీఎల్ క్రేజ్ వేరు. గత 15 సంవత్సరాలుగా ఈ లీగ్ విజయవంతంగా కొనసాగుతూ వస్తుంది. 2008 లో తొలిసారి ఈ మెగా లీగ్ కి శ్రీకారం చుట్టగా ఇప్పటివరకు ఏ మాత్రం పాపులారిటీ తగ్గట్లేదు. పరిస్థితులు అనుకూలించకపోయినా ఈ టోర్నీని ఏదో ఒక విధంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూనే వచ్చారు. మధ్యలో ఎలక్షన్స్ ,కరోనా కొంత అంతరాయం కలిగించిన టోర్నీ ఆపడానికి ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. బిగ్ బాష్, కరీబియన్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్ లాంటి ఎన్నో దేశాల్లో లీగ్ లకి ఐపీఎల్ కారణం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు ఎన్నో రికార్డులు సృష్టించిన ఐపీఎల్ ప్రస్తుతం ఒక చారిత్రాత్మక ఘనత అందుకునేందుకు సిద్ధంగా ఉంది.
ఐపీఎల్ లో నేడు ఆదివారం కానుండడంతో రెండు మ్యాచులని చూసేందుకు అభిమానులు సిద్ధపడిపోయారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఐపీఎల్ లో 999 వది కావడం గమనార్హం. ఇక రాత్రి రాజస్థాన్ రాయల్స్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో 1000వ మ్యాచ్ కావడం గమనార్హం. దీంతో ఈ రోజు ఈ మ్యాచ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 2008 లో కేకేఆర్ జట్టుతో ఆర్సీబీ ఆడిన మ్యాచు తో ఐపీఎల్ ప్రారంభమైంది. ఈ రోజు రాజస్థాన్ , ముంబై మ్యాచుతో 1000 మ్యాచులు పూర్తి చేసుకోనుంది.
ఇక ఈ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచుల్లో 6 విజయాలతో అదరగొడుతూ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచుల్లో కేవలం 2 విజయాలతో చివరి స్థానంలో నిలిచింది. ఇక రాజస్థాన్(5), లక్నో(5) చెన్నై(5),జట్లు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో బెంగళూరు(4), పంజాబ్(4), కేకేఆర్(3), సన్ రైజర్స్(3), ముంబై(3) ఉన్నాయి. మొత్తానికి నేటితో ఐపీఎల్ 1000 మ్యాచులు పూర్తి చేసుకోనుండడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.