ఐపీఎల్ లో ధోని, జడేజా మధ్య ఉండే బంధం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఎప్పటినుంచో చెన్నై జట్టుకి ఆడుతూ ఎన్నో విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మంచి సఖ్యత లేదని తెలుస్తుంది. తాజాగా జడేజా భార్య చేసిన ట్వీట్ వైరల్ గా మారుతుంది.
వివాదాలకు, విభేదాలకు దూరంగా ఉండే వారిలో ధోని మొదటి వరుసలో ఉంటాడు. ఇప్పటివరకు ధోని మీద ప్రశంసలే గాని.. విమర్శలు చాలా తక్కువ. ఈ విషయాన్నీ బలపరుస్తూ .. ఈ ఏడాది అభిమానులు చూపించిన ప్రేమ, దిగ్గజాలు ఆటోగ్రాఫ్ తీసుకోవడం లాంటి విషయాలు ధోనిని మరో స్థాయికి తీసుకెళ్లాయి. దీంతో ధోని మీద అందరికీ అభిమానంతో పాటుగా గౌరవం కూడా పెరిగింది. జీవితంలో అంతా మంచే జరిగే క్రమంలో ఊహించని కుదుపు ఒకటి వస్తుంది అనే సిద్ధాంతం ఒకటి ఉంది. ప్రస్తుతం జడేజా రూపంలో ధోనికి అలాంటి పరిస్థితి వచ్చిందనే వార్తలు ఊపందుకుంటున్నాయి. తాజాగా జడేజా భార్య చేసిన ట్వీట్ వైరల్ గా మారుతుంది.
ఐపీఎల్ లో ధోని, జడేజా మధ్య ఉండే బంధం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఎప్పటినుంచో చెన్నై జట్టుకి ఆడుతూ ఎన్నో విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ మ్యాచులు ఆడేటప్పుడు కూడా వీరి సాన్నిహిత్యం అలాగే కొనసాగింది. రైనా తర్వాత ధోనికి బాగా దగ్గరైన వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జడేజా మాత్రమే. పలు ఇంటర్వూలో కూడా ఒకరి మీద మరొకరు ప్రశంసలు కురిపించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మంచి సఖ్యత లేదని తెలుస్తుంది. ఈ సీజన్ లో అల్ రౌండ్ షో తో అదరగొడుతున్న జడేజా.. మూడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచులు కూడా అందుకున్నాడు.
ఈ సీజన్ లో ధోనికి విపరీతమైన అభిమానం చూపించడం వలన జడేజాకు రావాల్సిన గుర్తింపు రావట్లేదని సమాచారం. ఇటీవలే ఢిల్లీతో జరిగిన మ్యాచులో జడేజా ధారాళంగా పరుగులిచ్చిన నేపథ్యంలో ధోని జడేజా మీద ఆగ్రహం చూపించినట్టు వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనికి కారణాలు వేరేలా ఉన్నాయని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు జడేజా చాలా సందర్భాల్లో తాను బ్యాటింగ్ కి వచ్చినప్పుడు అభిమానులు ఔటవ్వలని కోరుకుంటున్నారని విచారం వ్యక్తం చేసాడు. దీనికి తోడు జడేజా ట్వీట్ చేస్తూ .. “కర్మ మన దగ్గరకు తిరిగి వస్తుంది. అది రావడం కాస్త లేట్ అవుతుందేమో గాని తప్పకుండా వస్తుంది”. అని క్యాప్షన్ పెడుతూ థమ్స్ అప్ సింబల్ గుర్తు పెట్టాడు.
జిడ్డు ఈ ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే తన భార్య రిబావ ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. నీ దారిలో నువ్వు వేళ్ళు అంటూ చేతులు జోడించిన ఐకాన్ తో కామెంట్ పెట్టింది. రివాబా పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలే వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయనుకుంటున్న తరుణంలో రిభావ ఇలా ట్వీట్ చేయడంతో వీరి మధ్య నిజంగా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఎంతో స్నేహంగా ఉండే జడేజా-ధోని ఇలా విభేదాలతో నిజంగానే దూరంగా ఉన్నారో లేదో ఇంకా పూర్తి క్లారిటీ అయితే లేదు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలోతెలపండి.
Definitely 👍 pic.twitter.com/JXZNrMjVvC
— Ravindrasinh jadeja (@imjadeja) May 21, 2023