డేవిడ్ వార్నర్.. సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో మనందరకి తెలుసు. అయితే.. గొడవల్లోనూ అంతే ఆక్టివ్ గా ఉంటాడంటూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్ చేశాడు. అతడు ప్రాక్టీస్ కంటే పార్టీలకు ఎక్కువ వెళ్లేవాడని వ్యాఖ్యానించాడు. ఒకానొక సమయంలో అతని గొడవలు భరించలేక జట్టులోంచి తీసేసి ఇంటికి పంపించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.నిజమా? ఇదంతా ఎప్పుడు జరిగింది అనేగా? మీ అనుమానం.. అయితే ఇది చదవాల్సిందే.
2009 సీజన్ లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన వార్నర్ 2013 వరకు ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడిగా కొనసాగాడు. ఆ సమయంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్. 2009 లో సెహ్వాగ్ తో పాటు వార్నర్ ఓపెనింగ్ చేసేవాడు. అయితే జట్టులో చేరిన కొత్తలో వార్నర్ ప్రవర్తన మిగిలిన ఆటగాళ్లతో పోలిస్తే భిన్నంగా ఉండేదని వీరూ చెప్పుకొచ్చాడు. వార్నర్ ప్రాక్టీస్ సెషన్ల కంటే పార్టీలకు ఎక్కువ వెళ్లేవాడని తెలిపాడు.
ఇది కూడా చదవండి: Ravi Shastri: రవిశాస్త్రికి మరో క్రికెటర్ బిర్యానీ బాకీ ఉన్నాడంట!
“అతడు (వార్నర్) జట్టులోకి కొత్తగా వచ్చాడు. అతడేం జట్టుకు ప్రత్యేకమైన వ్యక్తి కాదు.. అందరిలానే అతను ఒక ఆటగాడు మాత్రమే. మొదట్లో ప్రాక్టీస్ సెషన్ల కంటే పార్టీలకు ఎక్కువ వెళ్లేవాడు. పోనీ ఆటగాళ్లతో సఖ్యతగా ఉండేవాడా? కాదు.. అందరితోనూ గొడవలే. చివరకి అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాం. చివరి రెండు మ్యాచ్‌లలో ఆడకుండా ఇంటికి పంపించాం” అని సెహ్వాగ్ తెలిపాడు.
🗣️ Virender Sehwag: David Warner used to party more than practice while at Delhi Daredevils 👀 #IPL2022 pic.twitter.com/pBr5CcUYYG
— CricFit (@CricFit) May 7, 2022
సన్‌రైజర్స్ జట్టుతోనూ విభేదాలే
వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మేనేజ్‌మెంట్ దారుణంగా అవమానించిన సంగతి తెలిసిందే. గత సీజన్ మధ్యలో అతన్ని కెప్టెన్‌గా తొలగించింది. కేన్ విలియమ్సన్‌కు జట్టు పగ్గాలు అప్పజెప్పింది. జట్టుతో విభేదాల వల్ల వార్నర్‌ను తొలుత ప్లేయింగ్ 11 నుంచి తొలగించిన సన్ రైజర్స్ యాజమాన్యం తర్వాత సీజన్ కోసం అతన్ని రిటైన్ చేసుకోకుండా వదులుకుంది. 2009 నుంచి 2013 వరకు ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడిన వార్నర్.. 2014 నుంచి 2021 వరకు సన్ రైజర్స్ లో భాగమయ్యాడు. ఇక మళ్లీ 2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.