విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఐపీఎల్ 2022 మ్యాచ్ లలో ఎంతో ఇబ్బంది పుడుతున్న విషయం చూస్తూనే ఉన్నాం. ఒకప్పటి విరాట్ ను తిరిగి చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే అదే బీసీసీఐ సెలక్టర్స్ కూడా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఐపీఎల్ తర్వాత జరగనున్న సౌతాఫ్రికా టీ20 సిరీస్ కు విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఐర్లాండ్ టూర్ కు కూడా విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నట్లు ఓ సెలక్టర్ వెల్లడించారు. ఆ విధంగా చూసుకుంటే ఇంక విరాట్ టీమిండియా తరఫున జులైలో జరిగే ఇంగ్లాండ్ సిరీస్ కు మాత్రమే అందుబాటులోకి వస్తాడు.
ఇదీ చదవండి: టీమిండియాలోకి ఉమ్రాన్ మాలిక్! టీ20 వరల్డ్ కప్ కోసమేనా?
వరుస మ్యాచ్ లు, ఐపీఎల్ లీగ్ ఇలా విరాట్ విశ్రాంతి లేకుండా ఆడుతున్న విషయం తెలిసిందే. టీమిండియా మాజీ హెట్ కోచ్ రవిశాస్త్రి సైతం కోహ్లీకి విశ్రాంతి అవసరమని చెప్పడం చూశాం. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను పొడిగించుకోవాలనుకుంటే మాత్రం ఐపీఎల్ విరాట్ తప్పుకోవాలని రవిశాస్త్రి మరోసారి నొక్కి చెప్పాడు. ఐపీఎల్ లో కోహ్లీ ప్రదర్శన ఏ మాత్రం హర్షించే విధంగా లేదు. కానీ, ఫ్యాన్స్ మాత్రం ఎంతటి లెజెండ్ కైనా కెరీర్ లో ఇలాంటి ఫేజ్ ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ కాస్త రెస్ట్ తిరిగి పుంజుకుంటాడని మాజీలు సైతం అభిప్రాయపడటం చూశాం. అన్నీ దృష్టిలో ఉంచుకునే సెలక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.