ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ కు చేరుకొంది. ఈసారన్నా కప్పు కొడుతుందనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు, ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశే ఎదురైంది. వచ్చే సంవత్సరం కూడా.. ‘ఈ సాలా కప్ నమ్దే’ అని చెప్పుకోవాల్సిందేనా అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్నీ కలిసొచ్చాయి కొప్పు కొట్టేస్తున్నాం అంటూ ఆశ పడిన ఫ్యాన్స్.. బంగపాటుకు గురి కావడం కొత్తేం కాదులే అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈసారి కప్పు సంగతి పక్కన పెడితే.. కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆర్సీబీ ఓడిపోవడం ఒకందుకు మంచిదే అయ్యిందంటూ కామెంట్ చేస్తున్నారు.
విషయం ఏంటంటే.. 2011లో విరాట్ కోహ్లీ పగ్గాలు చేపట్టాడు. ఆ తర్వాత 2021 వరకు జట్టుకు కెప్టెన్ గా కొనసాగాడు. అయితే ఇప్పటి వరకు ఆర్సీబీ టీమ్ ఐపీఎల్ లో 15 సార్లు ప్లే ఆఫ్స్ కు చేరింది. మొత్తం మూడుసార్లు ఫైనల్ కు చేరి.. రన్నరప్ గా నిలిచింది. 2009, 2011, 2016 సంవత్సరాల్లో ఆర్సీబీ ఐపీఎల్ రన్నరప్ గా నిలిచింది. కోహ్లీ పగ్గాలు అందుకున్న మొదటి సంవత్సరంలోనే ఆర్సీబీని రన్నరప్ గా నిలిపాడు.
Most runs for india in last two years
Virat Kohli : 1749 (avg. 38.23)
Rishabh pant : 1720 (avg. 40.95)
Rohit sharma : 1704 (avg. 37.8) pic.twitter.com/tim4MgNk74— ASHWIN (@viratian_tweetz) May 27, 2022
అయితే గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ఆర్సీబీకి కప్పు రాకపోవడానికి కారణం విరాట్ కోహ్లీ అంటూ ఒక వర్గం కోడై కూస్తున్న విషయం తెలిసిందే. అలాంటి కామెంట్స్ వింటూ సమాధానం చెప్పలేక ఊరుకున్న కోహ్లీ ఫ్యాన్స్ మొత్తానికి ఈ సీజన్లో అవకాశం దక్కింది. అందివచ్చిన అవకాశాన్ని కోహ్లీ ఫ్యాన్స్ బాగానే వాడుకుంటున్నారు. తప్పు కోహ్లీలో లేదు.. ఆర్సీబీ అంటేనే బ్యాడ్ లక్ అంటూ విరుచుకుపడుతున్నారు.
not a RCB fan but I feel sad for this guy. #ViratKohli #RCBvsRR pic.twitter.com/cjt9WbAJ5I
— Aman. (@meamanraza) May 27, 2022
ఈ సీజన్లో కోహ్లీ కెప్టెన్ కాదు.. తమ చేతుల్లో లేకపోయినా ముంబై జట్టు పుణ్యమా అని ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టారు. ఎలిమినేటర్ మ్యాచ్ లో వీరోచితంగా పోరాడారు.. కానీ, క్వాలిఫయర్ కి వచ్చే సరికి అంతా సమిష్టిగా చేతులెత్తేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. దరిద్రం అంతా ఆర్సీబీ జట్టులోనే ఉంది అంటూ ఎద్దేవా చేస్తున్నారు. విరాట్ కోహ్లీని ఇప్పటికైనా ఆడిపోసుకోవడం ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అసలు బ్యాడ్ లక్ అంతా ఆర్సీబీలోనే ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
RCB losing the match but 85000+ People still Chanting KOHLI KOHLI…
Tells you the Stardom and craze of this man @imVkohli 🔥👑— Pranjal (@Pranjal_one8) May 27, 2022
” Remove Virat Kohli from Captaincy and RCB will win trophy ” . Holddddd.
— neeraj. (@_masterofchase_) May 27, 2022
Aaarr Ceee Beee.. till eternity ! 💫❤@imVkohli pic.twitter.com/khlnknxn7a
— Anamika Rai✨ VK❤️ (@Kohlified05) May 28, 2022