ఐపీఎల్-2022 సీజన్ ప్రారంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇలాంటి తరుణంలో తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ధోనీ ప్రకటించాడు. అంతేకాకుండా నెక్ట్స్ కెప్టెన్సీ కోసం జడేజాను ఎంచుకుంటూ యాజమాన్యానికి సూచించాడు కూడా. అయితే ఈ తరుణంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అంటూ అభిమానులే కాదు.. క్రికెటర్లు, మాజీలు కూడా ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ గురించి ఎదురుచూపులు కంటే అసలు ధోనీ ఎందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు అనేదే అందరి ఆలోచన. అందుకు విరాట్ కోహ్లీ కూడా అతీతుడేం కాదు. అతను కూడా ధోనీ నిర్ణయంపై ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు.
ఇదీ చదవండి: ధోనీ కెప్టెన్సీ వదులుకోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఎమోషనల్!
ధోనీని ఆప్యాయంగా హత్తుకుంటూ ఉన్న పిక్ ను ట్వీట్ చేస్తూ.. ‘చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా నీ శకం అత్యద్భుతం. నీ కెప్టెన్సీని ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. నువ్వంటే ఎప్పటికీ గౌరవం’ అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. కోహ్లీ ట్వీట్ చేసిన కొద్ది నిమిషాలకే అది వైరల్ గా మారిపోయింది. అభిమానులు కోహ్లీ- ధోనీ కలిసున్న ఫొటోలను షేర్ చేయడం మొదలు పెట్టారు. కోహ్లీ ట్వీట్ పై మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Legendary captaincy tenure in yellow skip. A chapter fans will never forget. Respect always. ❤️💛 @msdhoni pic.twitter.com/cz5AWkJV9S
— Virat Kohli (@imVkohli) March 24, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.