టీమిండియా, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత ఫామ్‌లోకి వచ్చాడు. తనకు మాత్రమే సాధ్యమైన క్లాస్ కవర్ డ్రైవ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఆర్సీబీకి చావో రేవో లాంటి మ్యాచ్‌లో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఐపీఎల్ 2022లో గురువారం పటిష్టమైన గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 73 పరుగులతో తాను ఫామ్ అందుకోవడంతో పాటు తన టీమ్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆడిన ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు.
ఒకే ఫ్రాంచైజ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును సృష్టించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరపున విరాట్ కోహ్లీ 7వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో మరే క్రికెటర్ కూడా ఇక ఫ్రాంచైజ్ తరపున ఇన్ని పరుగులు చేయలేదు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ 221 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 6,592 పరుగులు చేశాడు. మిగతా పరుగులు ఆర్సీబీ తరపున ఛాంపియన్స్ లీగ్‌లో ఆడి చేశాడు. ఇలా ఒకే జట్టు తరపున 7వేలకు పైగా పరుగులు చేసిన ఒకే ఒక ఆటగాడు విరాట్ కోహ్లీ. అలాగే ఐపీఎల్ 6500 పరుగుల మార్క్ అందుకున్న తొలి ఆటగాడు కూడా విరాట్ కోహ్లీనే. ఐపీఎల్‌లో కోహ్లీకి 5 సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో అంతగా రాణించని కోహ్లీ.. కీలక మ్యాచ్‌లో తన బ్యాట్‌ను ఝుళిపించి ఆర్సీబీని గెలిపించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (62పరుగులు 47బంతుల్లో 4ఫోర్లు 3సిక్సర్లు నాటౌట్), డేవిడ్ మిల్లర్ (34పరుగులు 25బంతుల్లో 3సిక్సర్లు) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హెజల్‌వుడ్ 2, హసరంగా, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ తీసుకున్నారు. 169 పరుగుల టార్గెట్‌ను ఆర్సీబీ ఈజీగా చేజ్ చేసింది. కోహ్లీ 73, డుప్లెసిస్ 44, మ్యాక్స్‌వెల్ 40 నాటౌట్ రాణించడంతో ప్లేఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. మరి కోహ్లీ సాధించిన వరల్డ్ రికార్డ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Matthew Wade: అంపైర్ నిర్ణయంపై ఆగ్రహంతో ఊగిపోయిన మ్యాథ్యూ వేడ్! వీడియో వైరల్
Awards galore for @imVkohli and @Gmaxi_32 after a memorable night at the Wankhede. 🤩👏🏻👏🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #RCBvGT pic.twitter.com/vfhfLufSsi
— Royal Challengers Bangalore (@RCBTweets) May 19, 2022
7000 runs for RCB alone 😯
Virat Kohli is something else!#IPL2022 #RCBvsGT pic.twitter.com/0WCy5bkqLl
— ESPNcricinfo (@ESPNcricinfo) May 19, 2022