ఐపీఎల్ 2022లో విరాట్ కోహ్లీ ఏకంగా మూడోసారి గోల్డెన్ డక్ అయ్యాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సుచిత్ బౌలింగ్‌లో SRH కెప్టెన్ విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ సీజన్‌లో ఫామ్‌లేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కోహ్లీ మరోసారి గోల్డెన్ డక్ అవ్వడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. చాలా నిదానంగా నడుస్తూ తలకాయ కిందికి వేస్తూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన కోహ్లీ ఫ్యాన్స్ కూడా చాలా బాధపడ్డారు. కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడి ఏంటి ఈ గడ్డు కాలం అంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అవుట్ తర్వాత.. డ్రెసింగ్ రూమ్ చాలా డల్‌గా కూర్చున్న కోహ్లీ.. ఇన్నింగ్స్ చివర్లో దినేష్ కార్తీక్ ఆడిన ఇన్నింగ్స్‌తో తన బాధనంతా మర్చిపోయినట్లు కనిపించాడు.
చివర్లో 8 బంతులాడిన డీకే 4 సిక్సులు, ఒక ఫోర్ బాది ఏకంగా 30 పరుగులు చేసి ఆర్సీబీ భారీ టార్గెట్ సెట్ చేసేలా ఆడాడు. తుపాన్ ఇన్నింగ్స్ ఆడి డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన డీకేను కోహ్లీ ఎంతో సంతోషంగా అభినందించాడు. డీకే కూడా కోహ్లీ ఆనందానికి మురిసిపోయాడు. ఇద్దరు ఎంతో సంతోషంగా హగ్ చేసుకున్నారు. అంతే కాకుండా డీకేకు కోహ్లీ వంగి టేక్ ఏ బౌ అనడం కూడా హైలెట్. ప్రస్తుతం కోహ్లీ.. డీకేను అభినందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను డకౌట్ అయినందుకు ఎంతో బాధలో ఉన్న కోహ్లీ.. డీకే బ్యాటింగ్‌కు ఫిదా అయి ఆ బాధను మర్చిపోయి.. ఎంతో ఉత్సహంగా ఫీల్డింగ్‌కు వచ్చాడు. డీకే బ్యాటింగ్‌తోనే కోహ్లీలో ఆ ఎనర్జీ వచ్చింది. లేకుంటే కోహ్లీని ఫీల్డ్‌లో డల్ చూడలేం అంటూ కూడా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Faf Du Plessis: SRHతో మ్యాచ్‌లో త్వరగా అవుటై.. పెవిలియన్ వెళ్లాలనుకున్నా: డుప్లెసిస్
— Diving Slip (@SlipDiving) May 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.