ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఈ సీజన్‌లో 3 సెంచరీలు చేసిన బట్లర్ ఆరెంజ్ కప్‌ను తనవద్దే అంటిపెట్టుకుని ఉన్నాడు. లీగ్ తొలి అర్ధభాగంలో సూపర్ ఫామ్‌లో పరుగుల వరద పారించిన బట్లర్.. రెండో అర్ధభాగంలో అంతగా పరుగులు చేయలేదు. కానీ.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగి తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో తిరిగి తన ఫామ్‌ను కొనసాగించాడు. 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో అదరగొట్టాడు. దీంతో ఈ సీజన్‌లో బట్లర్ టాక్ ఆఫ్ క్రికెట్ టౌన్‌గా నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్‌లోనే భాగమైన ఒక స్టార్ క్రికెటర్ భార్య బట్లర్‌ను రెండో భర్త స్వీకరిస్తా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దక్షిణాఫ్రికాకు చెందిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్ భార్య సారా ఈ వ్యాఖ్యలు చేసింది. బట్లర్, డస్సెన్ ఇద్దరూ రాజస్థాన్ రాయల్స్‌కే ఆడుతున్నారు. దీంతో డస్సెన్ భార్య లారా రాజస్థాన్ రాయల్స్ ఆడే ప్రతి మ్యాచ్ హాజరై.. రాయల్స్ టీమ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో లారాను అందరూ బట్లర్ భార్యగా పొరపాటు పడుతున్నారు. ఇదే విషయాన్ని లారా ఎందుట ప్రస్తావించగా.. ఆమె నవ్వుతూ.. ఇప్పుడు బట్లర్‌ను నా రెండో భర్తగా దత్తత తీసుకోవాలి అంటూ సరదాగా పేర్కొంది. డస్సెన్‌కు ఎక్కువ మ్యాచ్‌ల్లో తుది జట్టులో స్థానం లభించలేదు. అయినా కూడా లారా రాజస్థాన్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరై తన మద్దతు తెలుపుతోంది.
రాజస్థాన్ జట్టులో బట్లర్ ఎక్కువగా రాణిస్తుండడంతో అతను ఫోర్లు, సిక్సులు కొట్టినప్పుడు రాజస్థాన్ ఫ్యామిలీ స్టాండ్‌లోని వాళ్లందరితో పాటు లారా కూడా కేరింతలు కొడుతూ కనిపిస్తుంది. దీంతో ఆమె బట్లర్ వైఫ్ అంటూ చాలా మంది పొరపడుతున్నారు. పైగా బట్లర్ భార్య లూసీ, డస్సెన్ భార్య లారా చూసేందుకు కొంచెం ఒకే విధంగా ఉంటారు. అందుకే చాలా మంది అలా పొరపడి ఉంటారని ఆమె పేర్కొన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్! వివరణ ఇచ్చుకున్న మిస్టర్ 360
“I’ve adopted Jos as my second Husband” – Rassie van der Dussen’s wife responds to fans thinking of her as Jos Buttler’s better half https://t.co/A6UAEnbYZF #IPL #JosButtler
— FirstSportz (@SportzFirst) May 26, 2022