‘ఐపీఎల్ 2022’ మెగా వేలానికి BCCI చకాచకా ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఈ వేలం నిర్వహించనున్నారు. అయితే ఈ వేలం సందర్భంగా అందరి దృష్టి SRHవైపే మళ్లింది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ ను వదులుకుని పెద్ద తప్పు చేసింది అంటూ సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. అందుకే అసలు వీళ్లు వేలంలో ఎవరిని దక్కించుకుంటారు? ఎంతకు దక్కించుకుంటారు? అనే దానిపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు వార్నర్ మామ ట్వీట్ తో మళ్లీ ఆ చర్చ తెరపైకి వచ్చింది. అంతేకాదు సెటైర్, కౌంటర్లతో డేవిడ్ వార్నర్- SRH మధ్య ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ వారే నడిచింది.
A total demolition job from Australia.
England have had their gaping holes in test cricket covered for too long by two superstars, these are exposed away from home! #Ashes— Tom Moody (@TomMoodyCricket) December 28, 2021
ట్విట్టర్ లో SRH హెడ్ కోచ్ టామ్ మూడీని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు వార్నర్ సెటైర్ వేశాడు. అసలు కథ అక్కడే మొదలైంది. ఆ తర్వాత వార్నర్ కు SRH కౌంటర్ వేసింది. ఇదంతా చూస్తుంటే వార్నర్ రివేంజ్ మొదలు పెట్టినట్లుగా అనిపిస్తోంది. యాషెస్ గురించి పోస్టు పెట్టిన టామ్ మూడీకి ఓ అభిమాని ‘వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా ఉండబోతోంది?’ అని ప్రశ్నించాడు. ఆ ట్వీట్ కు డేవిడ్ వార్నర్ సమాధానం ఇచ్చాడు. నాకు తెలిసి బొక్కబోర్లా పడతారు అనే తరహాలో ‘బాహా డౌట్ ఇట్’ అంటూ వార్నర్ రిప్లై ఇచ్చాడు.
How good was he 👌👌👌 https://t.co/7MG9YAhlcD
— David Warner (@davidwarner31) December 28, 2021
అయితే అందుకు SRH కూడా ఊరుకోకుండా వార్నర్ కు కౌంటర్ ఇచ్చింది. ‘వార్నర్ నువ్వు తిరిగి ఫామ్ లోకి వచ్చినట్లు ఉన్నావు. యాషెస్ సిరీస్ గెలిచినందుకు శుభాకాంక్షలు. వేలంలో నీకు కూడా మంచి ధర రావాలి’ అంటూ ట్వీట్ చేశారు. చాలా ప్రొఫెషనల్ గా కనిపించిన ఈ ట్వీట్ లో SRH వాళ్లు వార్నర్ కు పెద్ద కౌంటరే వేశారు. ఫామ్ లో లేవని మేము వదులుకున్నాం. ఇప్పుడు బాగానే సెట్ అయినట్లున్నావు. సరే వేలంలో నీకు ఎంత ధర వస్తుందో చూద్దాం అనేలా వాళ్ల ట్వీట్ ఉంది. సోషల్ మీడియాలో అభిమానులు కూడా ఇదే భావనకు వస్తున్నారు. SRH ట్వీట్ పై వార్నర్ ఇంకా స్పందించలేదు. మరో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడేమో చూడాలి. డేవిడ్ వార్నర్ ను వదులుకుని SRH తప్పు చేసిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Congrats on the Ashes win Davey – Looks like you are back to 🍾🍻 form and enjoying the after party! On the other hand we hope you have a good auction! 👍🏼😂 https://t.co/grZrRn5Zqm
— SunRisers Hyderabad (@SunRisers) December 28, 2021