ఐపీఎల్ 2022లో మంగళవారం తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడి ఫైనల్‌కు చేరింది. రాజస్థాన్ రాయల్స్‌కు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్2లో పోటీ పడనుంది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్‌లో రియాన్ పరాగ్ వైఖరిపై సూర్యకుమార్ యాదవ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. ముంబై ఇండియన్స్ స్టార్ సూర్య సాధారణంగా ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్ పట్ల నెటిజన్లు అసాధారణంగా రియాక్ట్ అవుతున్నారు. ట్విట్టర్‌లో ఓ వర్గం సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ రియాన్ పరాగ్ వైఖరిని మెచ్చుకోవడాన్ని మాత్రం పూర్తిగా తప్పుపట్టారు. ఇలాంటి ట్వీట్‌ను తొలగించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌లో రియాన్ పరాగ్ బౌండరీల వద్ద అద్భుతంగా ఫీల్డింగ్ చేసినప్పటికీ నోటి దురుసు మాత్రం తగ్గించుకోలేదు. అయితే రియాన్ పరాగ్ ఫీల్డింగ్ ఆటిట్యూడ్ పై సూర్యకుమార్ యాదవ్ ట్వీట్ చేస్తూ.. ’అమేజింగ్ ఆటిట్యూడ్ ఆన్ ది ఫీల్డ్’ అని పేర్కొన్నాడు. సూర్య చేసిన ఈ ట్వీట్‌ను పలువురు స్వాగతించగా.. మరికొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గుజరాత్ ఛేజింగ్ చేస్తున్న టైంలో ట్రెంట్ బౌల్ట్ వేసిన 16వ ఓవర్‌లో గుజరాత్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ వైడ్ లాంగ్ ఆన్ వైపు ఓ షాట్ ఆడాడు. ఇక లాంగ్ ఆన్‌లో ఉన్న పరాగ్ అత్యంత వేగంగా పరిగెత్తి స్లిడ్ చేసి బంతిని బౌండరీకి చేరకుండా ఆపాడు. ఇక ఆ బంతిని చేత్తో పట్టుకుంటే బౌండరీకి టచ్ అవుతానేమోనని వెంటనే బాల్ డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకొస్తున్న దేవదత్ పడిక్కల్ వైపు విసిరేశాడు. అతను విసిరేసిన టైంలో ఓ రకంగా ప్రవర్తించాడు.
ఏంటలా పెళ్లికి వెళ్తున్నవాడిలా మెల్లగా వస్తావ్.. త్వరగా బాల్ అందుకుని త్రో వేయి అన్నట్లు కోపంగా ప్రవర్తించాడు. వెంటనే దేవదత్ బాల్ అందుకుని కీపర్ వైపు త్రో వేశాడు. ఫలితంగా రెండు రన్స్ సేవ్ అయ్యాయి. కానీ పరాగ్ మాత్రం తనకు కాస్త సీనియర్ అయిన తోటి సహచరుడి పట్ల అలా దురుసుగా ప్రవర్తించడం కాస్త అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయంలో రియాన్ పరాగ్‌పై విమర్శలు వస్తున్నాయ. కాగా వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ఉందని.. అందుకే చనువు కొద్ది అలా ప్రవర్తించి ఉంటాడని మరొ కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో 89 పరుగులు చేసి రాణించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 47 పరుగులు చేసి సాయి కిషోర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, పాండ్యా, దయాళ్, సాయి కిషోర్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఇక భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌ను ట్రెంట్ బౌల్ట్ తొలి ఓవర్‌లోనే ఫామ్‌లో ఉన్న సాహాను అవుట్ చేసి దెబ్బతీశాడు. ఆ తర్వాత మాథ్యూ వేడ్, శుభ్‌మన్ గిల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ.. సమన్వయ లోపంతో గిల్ 21 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌లో 35 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. కొద్ది సేపటికి వేడ్ 30 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఇక్కడి నుంచి కెప్టెన్ హార్థిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ముగించారు. పాండ్యా 27 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు, మిల్లర్ 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఈ సీజన్‌తోనే బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్‌లోనే ఫైనల్ చేరి అదరగొట్టింది. మరి రియాన్ పరాగ్‌కు సూర్యకుమార్ యాదవ్ మద్దతు తెలపడంపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: David Miller: రాజస్థాన్ రాయల్స్‌కు సారీ చెప్పిన మిల్లర్! కారణం ఏంటి?
Amazing attitude on the field 😍#riyanparag #RRvGT
— Surya Kumar Yadav (@surya_14kumar) May 24, 2022