క్రికెట్ అభిమానులకు రెండున్నర నెలల పాటు వినోదం పంచిన ఐపీఎల్ ఆదివారం జరిగిన ఫైనల్‌తో ముగిసింది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పైనల్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. ఛాంపియన్‌గా నిలిచింది. గుజరాత్ విజేత నిలవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు తెలిపాడు. కెప్టెన్ హార్థిక్‌పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. అలాగే తన ఐపీఎల్ టీమ్‌ను కూడా ప్రకటించాడు. ఈ టీమ్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోనీ, పంత్ లాంటి వాళ్లను సచిన్ తన జట్టులోకి తీసుకోకపోవడం గమనార్హం.
సచిన్.. పూర్తిగా ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అతను హార్దిక్ పాండ్యాను తన జట్టు కెప్టెన్‌గా పేర్కొన్నాడు. ఈ సీజన్లో 863 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న జోస్ బట్లర్‌ను ఓపెనర్‌గా పేర్కొన్నాడు. పంజాబ్ కింగ్స్ తరఫున డీసెంట్ ఓపెనింగ్ ఇచ్చిన శిఖర్ ధావన్‌ను మరో ఓపెనర్‌గా ఎంపిక చేశాడు. ధావన్ ఈ సీజన్‌లో బాగానే రాణించినా దక్షిణాఫ్రికా T20 సిరీస్‌కు మాత్రం అతన్ని ఎంపిక చేయలేదు. సచిన్ టెండూల్కర్ తను పేర్కొన్న జట్టులో మిడిల్ ఆర్డర్లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్‌లను ఎంపిక చేశాడు. ఇక ఈ నలుగురు ప్లేయర్లు ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టిన సంగతి తెలిసిందే.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రాహుల్ 600 పైచిలుకు పరుగులు సాధించగా, హార్దిక్ ఆల్‌రౌండర్‌గా, కెప్టెన్‌గా సత్తా చాటాడు. ఈ సీజన్‌లో దాదాపు 500 పరుగులు చేయడంతోపాటు 8వికెట్లు కూడా తీశాడు. అదే సమయంలో డేవిడ్ మిల్లర్ తన కెరీర్‌లో అత్యుత్తమ ఐపీఎల్ సీజన్ ఆడాడు. 16 మ్యాచ్‌ల్లో 68.71 సగటుతో 143 స్ట్రైక్ రేట్‌తో 481పరుగులు సాధించాడు. మరోవైపు లివింగ్‌స్టోన్ సీజన్ సిక్స్‌ల మీద సిక్సులు కొడుతూ ప్రత్యర్థులను వణికించాడు. ఇక ఈ సీజన్లో 117 మీటర్ల భారీ సిక్సర్ కూడా అతని పేరిటే ఉంది. ఇక మరో ఫినిషర్‌గా దినేష్ కార్తీక్‌ను కూడా సచిన్ తన జట్టులోకి తీసుకున్నాడు. ఈ సీజన్‌లో దినేష్ కార్తీక్ అసాధారణ నిలకడతో ఫినిషర్ రోల్‌లో ఆడాడు. అతను ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోయాడు. అందుకే దినేష్ కార్తీక్‌కు ఫినిషింగ్ బాధ్యతలను సచిన్ అప్పగించాడు. కార్తీక్ మొత్తం సీజన్‌లో 183.33అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. అతను 16 మ్యాచ్‌ల్లోవ 55 సగటుతో 330 పరుగులు చేశాడు. అతను రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్ కోసం భారత టీ20 జట్టులో పునరాగమనం కూడా చేశాడు.
బౌలింగ్ లైనప్‌లో సచిన్ టెండూల్కర్ జస్ప్రీత్ బుమ్రాను బౌలింగ్ దళాన్ని నడిపించే ప్లేయర్ గా పేర్కొన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లలో ముంబై అత్యుత్తమంగా రాణించనప్పటికీ బుమ్రాను మాత్రం తన ప్లేయింగ్ 11లో సచిన్ చేర్చాడు. అతను 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు. అయితే కేకేఆర్ తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల హాల్ సాధించాడు. బౌలర్లో మిగతావారిలో మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, రషీద్ ఖాన్ ఉన్నారు. వీరందరూ తమ తమ జట్లకు మంచి ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కాగా ధోనిని తను జట్టులోకి సచిన్ తీసుకోకపోవడంపై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ధోని 2007లో టీమిండియా కెప్టెన్ అవ్వడానికి పరోక్షంగా సచిన్ టెండూల్కరే ప్రధాన కారణం. సచిన్ సూచన మేరకే ధోనికి టీమిండియా కెప్టెన్‌గా అవకాశం వచ్చింది. కానీ.. ఇప్పుడు అదే ధోనిని సచిన్ తన జట్టులోకి తీసుకోకపోవడం విశేషం. మరి సచిన్ జట్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ 2022 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్: జోస్ బట్లర్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, దినేష్ కార్తీక్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.
ఇదీ చదవండి: IPL 2022: రాజస్థాన్‌కు అవమానం.. గట్టి కౌంటరిచ్చిన సంజూ శాంసన్ భార్య చారులత!
Here’s #SachinTendulkar’s Playing XI for #IPL2022 @sachin_rt https://t.co/ULSxqokk0m
— Zee News English (@ZeeNewsEnglish) May 31, 2022