ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2022లో మాత్రం అత్యంత దారుణంగా విఫలం అయింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. 10 మ్యాచ్‌ల్లో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. పైగా వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. తొలి విజయం కోసం తొమ్మిది మ్యాచ్‌ల వరకు ఎదురు చూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంది. కాగా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ వైఫల్యంపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. అలాగే రాబోయే సీజన్‌లో తమ టార్గెట్ ఏంటో తెలిపాడు.
ఐపీఎల్ 2023 సీజన్ కచ్చితంగా ఇలా ఉండబోదని రోహిత్ శర్మ తేల్చి చెప్పాడు. దద్దరిల్లిపోద్దని స్పష్టం చేశాడు. గట్టిగా కొట్టబోతున్నామని, దీనికోసం ముందస్తు ప్రణాళికలను రూపొందించుకుంటామని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌ను పురస్కరించుకుని ముంబై ఇండియన్స్ అధికారిక వెబ్‌సైట్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 2023 ఐపీఎల్ సీజన్‌లో కొత్త ముంబై ఇండియన్స్ ఆటతీరును చూస్తారని హామీ ఇచ్చాడు. అభిమానులకు తాను మాట ఇస్తున్నానని అన్నాడు. ముంబై ఇండియన్స్ మిడిలార్డర్ డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇదే హామీ ఇచ్చాడు. 2023లో తాము ఆరోసారి ఐపీఎల్ కప్‌ను ముద్దాడబోతున్నామని అన్నాడు. ఈ ఏడాది తమ జట్టును దురదృష్టం వెంటాడిందని వ్యాఖ్యానించాడు. కొన్ని పొరపాట్లు చోటు చేసుకున్నాయని, వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదని అన్నాడు. మ్యాచ్‌కు ముందు వేసుకున్న ప్రణాళికలు గ్రౌండ్‌లో ఇంప్లిమెంట్ చేయలేకపోయామని చెప్పాడు. ఐపీఎల్ 2023లో తాము ఆరోసారి కప్‌ను అందుకుంటామని భరోసా ఇచ్చాడు.కాగా.. ముంబై ఇండియన్స్ ఖాతాలోనే ఇప్పటి వరకు అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయి. ఆ జట్టు ఇప్పటికే ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఆదివారం ఐపీఎల్ 2022 ఫైనల్ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. దీంతో చాలా ఏళ్ల తర్వాత ఒక కొత్త విజేతను చూడబోతున్నాం. ఎప్పుడో టోర్నీ ఆరంభ టైటిల్‌ను గెలిచిన రాజస్థాన్ మళ్లీ రెండో సారి ఫైనల్‌కు చేరింది. ఇక ఈ సీజన్‌తోనే ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ టోర్నీ ఆసాంతం అదరగొట్టింది. మరి వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన హామీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: క్వాలిఫైయర్‌లో ఓటమి తర్వాత ఫ్యాన్స్‌కు విరాట్ కోహ్లీ మెసేజ్!
SKY makes our goals for 2023 clear! 💪💙#OneFamily #DilKholKe #MumbaiIndians @surya_14kumar @ImRo45 @BrevisDewald MI TV pic.twitter.com/WBPCrPwrZc
— Mumbai Indians (@mipaltan) May 29, 2022