ఐపీఎల్ 2022 సీజన్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. కొత్త ఫ్రాంచైజీలు గుజరాత్, లక్నో రెండు జట్లు మంచి ప్రదర్శనతో దూసుకుపోతున్నాయి. చెన్నై, ముంబయి పరిస్థితి చెప్పనవసరం లేదు. 5 వరుస విజయాలతో అప్రతిహితంగా కొనసాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బ్రేకులు పడ్డాయి. గుజరాత్ టైటాన్స్ ఎస్‌ఆర్‌హెచ్ విజయావకాశాలపై గట్టి దెబ్బ కొట్టింది. అయితే చివరి వరకు గెలుస్తారనుకున్న మ్యాచ్ లో రషీద్, తెవాటియా ధ్వయం హైదరాబాద్ కు పరాయజయాన్ని మిగిల్చింది. అయితే రషీద్ ఖాన్ అంతలా చెలరేగి ఆడడానికి కారణం కూడా లేకపోలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ బ్రెయిన్ లారా చేసిన వ్యాఖ్యలే కారణమంటున్నారు.
ఇదీ చదవండి: వీడియో: మ్యాక్స్‌వెల్ వెడ్డింగ్ పార్టీలో కోహ్లీ డాన్స్.. పగలబడి నవ్విన ఆలెన్!
ఇటీవల రషీద్ ఖాన్ బౌలింగ్ గురించి బ్రెయిన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘రషీద్ ఖాన్ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ప్రత్యర్థి జట్లు రషీద్ ఖాన్ అనగానే డిఫెండ్ మోడ్‌లోకి వెళ్లిపోతారు. కానీ, రషీద్ ఖాన్ అంత గొప్ప వికెట్ టేకర్ ఏం కాదు. కానీ, ఓవర్ కు 6 పరుగుల చొప్పున అతనికున్న హౌలింగ్ సగటు మాత్రం గొప్పది’ అంటూ లారా వ్యాఖ్యలు చేశాడు. అయితే ఒకవైపు పొగుడుతూనే మరోవైపు రషీద్ ఖాన్ అంత గొప్ప వికెట్ టేకర్ కాదు అని లారా స్టేట్మెంట్ పాస్ చేశాడు. అది రషీద్ బాగా మనసులో పెట్టుకుని హైదరాబాద్ మీద ఆడినట్లుగా కనిపిస్తోందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
నిజానికి లారా చెప్పిందే నిజం అయ్యింది. రషీద్ ఖాన్ బౌలింగ్ పరంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏం చేయలేదు. గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్ ను రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో 8 మ్యాచ్‌లలో 32 ఓవర్లు వేసిన రషీద్ కు కేవలం 8 వికెట్లు మాత్రమే దక్కాయి. 7.09 ఎకానమీతో 227 పరుగులు ఇచ్చాడు. ఆ ప్రదర్శన పరంగా చూసుకుంటే మాత్రం రషీద్ బౌలింగ్ పై లారా చేసిన వ్యాఖ్యలను ఎవరూ తప్పుబట్టలేరు. హైదరాబాద్ మ్యాచ్ లోనూ 4 ఓవర్లు వేసిన రషీద్ 45 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. అభిషేక్ శర్మ అయితే రషీద్ బౌలింగ్ లో సిక్సులు బాదేశాడు.
ఇదీ చదవండి: అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్న SRH బౌలర్
This is what the #TataIPL is all about, you fight till the end! @rahultewatia02 I am glad we could get those runs together partner! 💪#GTvSRH #AavaDe #TataIPL2022 pic.twitter.com/DzhwHwysmv
— Rashid Khan (@rashidkhan_19) April 27, 2022
అయితే బౌలింగ్ వరకు లారా వ్యాఖ్యలు బాగానే ఉన్నాయి. కానీ, బ్యాటింగ్ విషయానికి వస్తే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. 11 బంతుల్లో 31 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన రషీద్ ఖాన్ హైదరాబాద్ ఓటిమిలో కీలకపాత్ర పోషించాడు. జాన్‌సన్ వేసిన 20వ ఓవర్లో రషీద్ ఖాన్ 3 సిక్సులు కొట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఆఖరి బంతికి 3 పరుగులు రావాల్సి ఉండగా సిక్స్ కొట్టి మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. అప్పటివరకు హైదరాబాద్ విజయం సాధిస్తుందని భావించిన అందరి అభిప్రాయాన్ని మార్చేశాడు. తనని రిటైన్ చేసుకోక పోగా.. అంత గొప్ప బౌలర్ కాదని కామెంట్ చేసుకున్న సన్ రైజర్స్ టీమ్ మొత్తానికి రషీద్ ఖాన్ గుణపాఠం నేర్పాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. వద్దనుకున్న జట్టుపై విజయం సాధించి రషీద్ తానేంటో నిరూపించుకున్నాడని ప్రశంసిస్తున్నారు. హైదరాబాద్ పై రషీద్ ఖాన్ పగ తీర్చుకున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Gujarat Titans needs 15 for 4 – Rashid Khan 6,0,6,6. Incredible Just Incredible Rashid Khan. pic.twitter.com/adF2FmCc2J
— CricketMAN2 (@ImTanujSingh) April 27, 2022
Rashid Khan joining MS Dhoni & Rahul Tewatia Match Finishing Club.😂
What a knock!!#GujaratTitans#Rahultewatia#Rashidkhan#RashidKhan#SRHvGT pic.twitter.com/gSowigZfBX
— Manmohan Ojha (@_manmohanojha) April 27, 2022
Couldn’t do well with ball today. But exceptional with bat 🔥. Never doubt Rashid Khan 💪 #IPL2022 #Rashidkhan pic.twitter.com/NZi4x5cqfC
— Om Ghorpade (@omghorpade99) April 27, 2022