ఐపీఎల్ 2022లో గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ విజయంతో ముంబైకి ఎలాంటి ఉపయోగం లేనప్పటికీ.. చెన్నైను మాత్రం ఈ ఓటమి ప్లేఆఫ్స్‌కు దూరం చేసింది. ముంబై బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై టీమ్ విలవిల్లాడింది. CSK కెప్టెన్ ఎంఎస్ ధోని తప్పించి.. మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలం అయ్యారు. ఫలితంగా CSK కేవలం 97 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ సీజన్‌లోనే చెన్నైకు ఇదే అత్యల్ప స్కోర్. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌చెప్పిన తర్వాత కూడా ధోని ఎంతో ఫిట్‌గా ఉండి కఠిన పరిస్థితుల్లోనూ సందర్భానికి తగ్గట్లు ఆడుతుంటే మిగతా టీమ్ మాత్రం దారుణంగా విఫలం అయింది.
ప్రస్తుతం ధోని వయసు 40 ఏళ్లు.. అయినా కూడా ఎంతో వేగంగా వికెట్ల మధ్య పరుగులు రాబడుతున్నాడు. యువ పేసర్లను ఎదుర్కొంటున్నాడు. కానీ.. CSKలోని మిగతా ప్లేయర్లు మాత్రం ముంబైతో మ్యాచ్‌లో ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. ధోని ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేస్తున్నా.. ఒక ఎండ్‌లో ధోని బాగా ఆడుతుంటే.. మరో ఎండ్‌లో వికెట్ కాపాడుకోలేకపోయారు. ధోనికి మద్దతు ఇచ్చి ఉంటే మ్యాచ్ ఇంత ఈజీగా CSK ఓడేది కాదు. CSK బౌలర్లు కూడా అంత ఈజీగా మ్యాచ్‌ను ముంబైకు ఇవ్వలేదు. వాళ్ల ప్రయత్నం వారు చేసి ముంబైని ముప్పుతిప్పలు పెట్టారు. ధోనికి ఎవరైన మద్ధతు ఇచ్చి వికెట్ కాపాడుకుని ఉండి ఉంటే.. మరో 30, 40 పరుగులు అదనంగా వచ్చేవి. మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. కనీసం వికెట్ కూడా కాపాడుకోలేకపోయారు. చివరి వరకు ధోని ఒక్కడే పోరాటం చేసి నాటౌట్‌గా నిలిచాడు.
33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 36 పరుగులు చేశాడు. CSK ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. ధోని 40 ఏళ్ల వయసులో కూడా ఎంత చురకుగా ఉన్నాడంటే.. CSK ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతిని మెరిడిత్ షార్ట్ బౌన్సర్ వేస్తే.. బ్యాట్‌కు బంతి తగలకున్నా.. తర్వాతి ఓవర్ స్ట్రైక్ తీసుకోవాలి, చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉందని.. ధోని పరుగు కోసం ప్రయత్నిస్తే.. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ముఖేష్ చౌదరీ రన్ పూర్తి చేయలేకపోయారు. బ్యాటింగ్ చేసి ధోని నాన్‌స్ట్రైకర్ ఎండ్‌కు వచ్చేసినా.. ముఖేష్ మాత్రం క్రీజ్‌లోకి చేరుకోలేకపోయాడు. బాల్ పట్టుకున్న కీపర్ ఇషాన్ కిషన్ ముఖేష్‌ను రన్ అవుట్ చేశాడు. అక్కడితో CSK ఇన్నింగ్స్ ముగిసింది. ధోని నాటౌట్‌గా మిగిలాడు. దీంతో ఈ మ్యాచ్లో జట్టు మొత్తం దారుణంగా విఫలం అయితే ధోని ఒక్కడే నిలబడ్డాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Tilak Varma: తెలుగు తేజం తిలక్ వర్మపై హర్భజన్ సింగ్ ప్రశంసలు.. సరైనోడు అంటూ..!
Thala gets us to 97. Second half awaits…#CSKvMI #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/3AalkXb5Vn
— Chennai Super Kings (@ChennaiIPL) May 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.