IPL 2022కి రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది రెండు కొత్త ఫ్రాంఛైజీల రాకతో ఈ ఐపీఎల్ మరింత ఉత్కంఠగా మారనుంది. ఇప్పుడు ఐపీఎల్ కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. అదే ధోనీ.. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో పెట్టుబడులు పెడుతున్నాడు అని. మరి అసలు ఆ వార్తలో నిజమెంతో తెలుసుకుందాం.
ధోని ప్రత్యర్థి జట్టులో హైదరాబాద్ పెట్టుబడులు పెట్టడం ఏంటి అనే కదా మీ అనుమానం. అవును ధోని పెట్టుబడులు పెడుతున్న మాట వాస్తవమే. కానీ నేరుగా ధోని హైదరాబాద్ జట్టులో పెట్టుబడులు పెట్టడం లేదు. 2015 నుంచి ధోనికి కార్స్ 24 సంస్థలో పెట్టుబడులున్నాయి. ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ కూడా ధోనీనే. ఈ ఏడాది కార్స్ 24 సంస్థ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించ నుంది . అందుకు సంబందించిన ఒప్పదం కూడా జరిగిపోయింది. ఆలా ధోని నేరుగా కాకుండా పరోక్షంగా పెట్టుబడులు పెట్టినట్లు ఐంది. అదే విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు.