హైదరాబాదీ కుర్రాడైన ‘మహ్మద్ సిరాజ్‘ ఐపీఎల్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని.. ఇప్పుడు టీమిండియా తరఫున కూడా సత్తా చాటుతున్నాడు. ఇదంతా ఒక్క రోజులో రాలేదు. దీనికి వెనుక ఎంతో కష్టం దాగుంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎంతో కష్టపడి నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు. ఐపీఎల్ 2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నఈ హైదరాబాదీ బౌలర్ ఆశించిన స్థాయిలో రాణించలేదన్నది వాస్తవం. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ అనంతరం సిరాజ్ తన ప్రదర్శనపై స్పందించాడు.
“చెన్నైపై మ్యాచ్ గెలిచి 2 పాయింట్లు సాధించడం సంతోషంగా ఉన్నప్పటికీ.. నా ప్రదర్శనపై సంతృప్తిగా లేను” అని తెలిపాడు. “మీ ఎక్సపెక్టేషన్స్ తగ్గట్టుగా నేను రాణించట్లేను.. కానీ, నాపై నమ్మకముంచండి. రాబోయే మ్యాచుల్లో తప్పక రాణిస్తాను” అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. సాదారణంగా ఆటగాళ్లు అద్భతమైన ఫామ్‌లో ఉన్నప్పడు ఉత్సహంగా కనిపిస్తారు. కానీ, సిరాజ్ మాత్రం ఫామ్‌లో ఉన్నా.. లేకపోయినా ఎప్పడూ ఒకేలా ఉంటాడు. ఇదే అతని ఆటతీరుకు నిదర్శనం. అయితే.. సిరాజ్ ప్రస్తుత సీజన్ లో అంతగా రాణించలేకపోతున్నాడు. వికెట్లు తీయకపోవడమే కాకుండా, ధారాళంగా పరుగులిస్తున్నాడు. సిరాజ్ ప్రదర్శన బెంగుళూరు జట్టులోని ఇతర బౌలర్లపై మరింత ఒత్తిడి పెంచుతోంది.
Believe in Miyan Magic @mdsirajofficial pic.twitter.com/BMsnQ5riea
— 🔥 A.k 💦 (@DC_TARD) May 5, 2022
ఇది కూడా చదవండి: మేము మనసు పెట్టి ఆడితే ఎంతటి జట్టుకైనా ఓటమే: RCB
ఈ ఏడాది చివరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022 జరగాల్సి ఉంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా తన మొట్టమొదటి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడనుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అక్టోబర్ 23న మొట్టమొదటి మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ టోర్నీ ముందువరకు మహ్మద్ సిరాజ్ కు జట్టులో స్థానం పక్కా అని భావించారు. కానీ, ప్రస్తుత ప్రదర్శనతో జట్టులో ఉంటాడా? ఉండడా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరి సిరాజ్ ప్రదర్శనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిజేయండి.
Before 2022 T20 World Cup 🔥🔥#IPL2022 #WorldCup2022 #TeamIndia pic.twitter.com/llslwoXFHr
— Cricket Addictor (@AddictorCricket) April 30, 2022