ఐపీఎల్ 2022లో కొత్తగా వచ్చిన టీమ్ గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయిన తొలి టీమ్‌గా నిలిచింది. గుజరాత్ టైటాన్స్ విజయ ప్రస్థానంలో బౌలర్ల పాత్ర ఎంతో ఉంది. ఆ జట్టు ప్రధాన బలం అంటే బౌలింగే. ఆ జట్టు బౌలింగ్ ఎటాక్‌కు టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ నాయకత్వం వహిస్తున్నాడు. తన సూపర్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. కానీ.. ఆ జట్టు కెప్టెన్ హార్థిక్ పాండ్యా, షమీ విషయంలో ఒక సారి ప్రవర్తించిన తీరుపై విమర్శలు వచ్చాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో పాండ్యా బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి అప్పర్ కట్ షాట్ ఆడాడు.
ఆ బంతి షమీకి చాలా ముందుగా పడింది. క్యాచ్ కోసం ఎందుకు ప్రయత్నించలేదని పాండ్యా షమీపై నోరుపారేసుకున్నాడు. ఆ సంఘటన మరువక ముందే.. తర్వాతి మ్యాచ్‌లో షమీ బౌలింగ్ పాండ్యా క్యాచ్ మిస్ చేశాడు. ఆ సమయంలో షమీ శాంతంగా ఉన్నాడు. దీంతో పాండ్యా అన్‌మెచ్యుర్డ్‌గా ప్రవర్తించాడని నెటిజన్లు కామెంట్ చేశారు. తాజాగా షమీ మాట్లాడుతూ.. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని, ప్రపంచం మొత్తం క్రికెట్ చూస్తుందని తన టీమ్ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు సూచించినట్లు పేర్కొన్నాడు. ఒక కెప్టెన్‌కు ఉండాల్సిన ముఖ్యలక్షణం అదే అన్నాడు. ప్రస్తుతం షమీ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది.ఒక సీనియర్ ప్లేయర్ అయిన షమీపై హార్థిక్ నోరు పారేసుకోవడంపై విమర్శలు వచ్చినా.. తాజాగా షమీ అదే విషయమై స్పందించడంతో మరోసారి ఈ విషయంపై చర్చ జరుగుతోంది. టీమిండియాకు ఈ ఇద్దరు ఆటగాళ్లు చాలా మ్యాచ్‌లు కలిసి ఆడారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్నా.. తనపై పాండ్యా ప్రవర్తించిన తీరుతో షమీ చిన్నబుచ్చుకున్నట్లు సమాచారం. ఆ మ్యాచ్ నుంచి ఇద్దరి మధ్య సఖ్యత లోపించినట్లు తెలుస్తుంది. పాండ్యా కూడా టోర్నీ ఆరంభంలో శాంతంగా కనిపించాడు. మ్యాచ్‌లు గెలుస్తున్నంత వరకు బాగానే ఉన్నా.. ఒక్కసారి ఓటమి రాగానే తనలోని కోపిష్ఠి బయటికి వచ్చాడు. ఒకసారి షమీపై, మరోసారి మిల్లర్‌పై నోరుపారేసుకున్నాడు. కెప్టెన్ అయినంత మాత్రం ఇలా సీనియర్ ప్లేయర్ల ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకోవడం సరైంది కాదని క్రికెట్ నిపుణులు సైతం విమర్శలు గుప్పించడంతో ఈ మధ్య పాండ్యా ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: CSK: IPL చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన తొలి టీమ్ CSK
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.