‘ఐపీఎల్ 2022’లో ఒక ఘట్టం ముగిసింది. ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ వివరాలను వెల్లడించాయి. అన్ని జట్లు దాదాపు తమ ఆస్థాన ఆటగాళ్లకే ఓటేశాయి. RCB కూడా ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అందులో ముఖ్యంగా మన తెలుగువాడు కూడా ఉన్నాడు. కోహ్లీ, మ్యాక్స్ వెల్, మహ్మద్ సిరాజ్ లను బెంగళూరు రిటైన్ చేసుకుంది. ఈ సారి కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో బెంగళూరు కెప్టెన్ పగ్గాలు మ్యాక్స్ వెల్ అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఆక్షన్ లో ఎవరెవరిని దక్కించుకుంటారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మహ్మద్ సిరాజ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది సిరాజ్ కు లక్నో భారీగా ఆఫర్ చేసినా రిజెక్ట్ చేశాడనేది.
లక్నో ఫ్రాంచైజీపై ఇప్పటికే హైదరాబాద్, పంజాబ్ టీమ్ లు మండిపడుతున్నాయి. తమ ప్లేయర్లను లాక్కొన్నారంటూ బీసీసీఐకి వెర్బల్ గా ఫిర్యాదు చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఇంకో వార్త కూడా వినిపిస్తోంది. మహ్మద్ సిరాజ్ ను వారి వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారనేది. సిరాజ్ రూ.10 కోట్లు ఆఫర్ చేశారని టాక్ వినిపిస్తోంది. రిటైన్ చేసుకుంటే బెగళూరు నుంచి మహ్మద్ సిరాజ్ కు వచ్చేది రూ.7 కోట్లే.. అది తెలిసే మూడు కోట్లు అదనంగా ఆఫర్ చేశారని తెలుస్తోంది. అయితే అందుకు సిరాజ్ నో చెప్పాడు. రూ.7 కోట్లకు బెంగళూరుతోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడు. జట్టుకు తన లాయల్టీని నిరూపించుకున్నాడు.
మహ్మద్ సిరాజ్ కు విరాట్ కోహ్లీకి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బెంగళూరు యాజమాన్యం కోసం కంటే.. కోహ్లీ కోసమే సిరాజ్ ఈ త్యాగం చేసినట్లు తెలుస్తోంది. కోహ్లీని తన పెద్దన్న, గురువుగా భావించే సిరాజ్ అతని కోసం రూ.3 కోట్లు త్యాగం చేశాడు. తన లాయల్టీని నిరూపించుకున్నాడని సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. హమారా హైదరాబాదీ సిరాజ్ అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. సిరాజ్ చేసిన పని సరైందేనా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Having retained Virat Kohli, Glenn Maxwell and Mohammed Siraj, RCB will head into the #IPL2022 Auction with a purse of 57 Crores. 💪🏼#PlayBold #WeAreChallengers #IPLRetention pic.twitter.com/KzRhBwnIqq
— Royal Challengers Bangalore (@RCBTweets) November 30, 2021