ఐపీఎల్ 2022 సీజన్ మొత్తం ఉత్కంఠగా సాగుతోంది. అసలు అంచనాలు కూడా లేని రెండు కొత్త జట్లు టేబుల్ టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాయి. అటు ఐపీఎల్ హిస్టరీలోనే ఎక్కువ టైటిల్స్ కొట్టిన జట్లు మాత్రం ఈ సీజన్లో ఎంతో నిరుత్సాహ పరిచాయి. ముంబై విషయానికి వస్తే ఈ సీజన్లో ఆ జట్టు ఆట ముగిసిందని అందరికీ తెలిసిందే. అయితే చెన్నైకి మాత్రం ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి. కానీ, ఆ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. తాజాగా రవీంద్ర జడేజా చేతికి గాయం కావడంతో జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పూర్తిగా ఈ సీజన్ నుంచే తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌లో బొక్కబోర్లా పడనుందా?
చెన్నై జట్టు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. కొన్న అద్భుతాలు జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్స్ కూడా వెళ్లే అవకాశం ఉంది. కానీ, జడేజా వంటి ఒక స్టార్ ఆలౌండర్ ఇలాంటి పరిస్థితుల్లో గాయంతో దూరం కావడం పెద్ద దెబ్బ అనే చెప్పాలి. కానీ, జడేజా చేతికి అయిన గాయం తీవ్రం కావడంతో ఈ సీజన్ కు ఇంక జడేజాకు విశ్రాంతి ఇచ్చేందుకు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైద్యులు కూడా జడేజాకి విశ్రాంతి ఇవ్వాలని సూచించినట్లుగా చెబుతున్నారు. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. జడేజాకి- యాజమాన్యానికి ఈ మధ్య కాస్త చెడిందని.. అందుకే గాయం కారణంగా చూపి అతడిని సీజన్ నుంచి తప్పించారంటూ చెబుతున్నారు. మరి అసలు విషయం ఏంటనేది.. జడేజా స్పందిస్తే అయినా క్లారిటీ వస్తుందేమో చూడాలి. జడేజా ఈ సీజన్ నుంచి తప్పుకోవడం వల్ల సీఎస్కేకి నష్టమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.