టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కి పరిచయం అవసరం లేదు. ఇక గంభీర్ ఐపీఎల్ ప్రస్థానం అద్భుతమనే చెప్పుకోవాలి. గౌతీ ఇప్పుడు ఐపీఎల్ 2022లో కొత్తగా అడుగుపుడెతున్న లక్నో ఫ్రాంచైజ్ కు మెంటర్ గా మారిన విషయం తెలిసిందే. అయితే.. గంభీర్ అప్పుడే మెంటర్ గా తన వ్యూహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మెగా ఆక్షన్ లో ఎవరెవరిని టీమ్ లోకి తీసుకోవాలో అప్పుడే ఒక లిస్ట్ తయారు చేసినట్లు సమాచారం.
Lucknow IPL team appoints Gautam Gambhir as Team Mentor. Dr. Sanjiv Goenka welcomed Gautam Gambhir to the RPSG family.#IndianPremierLeague #LucknowIPLTeam #Cricket @IPL @GautamGambhir pic.twitter.com/B6zhFIuFb2
— RP Sanjiv Goenka Group (@rpsggroup) December 18, 2021
గంభీర్ ముఖ్యంగా తన సారధ్యంలో కోల్ కతా తరఫున ఆడిన వారిపైనే ఎక్కువ గురి పెట్టినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా మనీశ్ పాండేను ఎలాగైనా టీమ్ లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా మనీశ్ పాండేను రిటైన్ చేసుకోలేదు. అంతేకాదు మనీశ్ ను హైదరాబాద్ టీమ్ సరిగ్గా ఉపయోగించుకోలేదని గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా లక్నో టీమ్ లోకి మనీశ్ పాండేను తీసుకోవాలని చూస్తున్నాడు. అదే జరిగితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ఇది కూడా భారీ ఎదురుదెబ్బే అవుతుంది.
Will KL Rahul be the captain of Lucknow franchise in IPL 2022?#VIVOIPL #IPL2022 #KLRahul pic.twitter.com/R0yNJ6RefK
— SportsGully (@thesportsgully) December 21, 2021
ఇప్పటికే డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ వంటి స్టార్లను వదులుకున్న హిస్టరీ వారి కుంది. ఆక్షన్ లో పాత రైజర్లను సొంతం చేసుకుంటామని ధీమాగా ఉన్నా కూడా అది సాధ్యపడే అవకాశాలు లేవు. దాదాపుగా కొత్త టీమ్ తోనే జర్నీ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇలా మ్యాచ్ గెలిపించే సత్తా ఉన్న ఆటగాళ్ల అంతా ప్రత్యర్థుల జట్లలోకి వెళితే హైదరాబాద్ కు కష్టమనే చెప్పాలి.
It’s a privilege to be in the contest again. Thanks Dr.Goenka for incl me in #LucknowIPLTeam as its mentor.The fire to win still burns bright inside me, the desire to leave a winner’s legacy still kicks me. I won’t be contesting for a dressing room but for the spirit & soul of UP
— Gautam Gambhir (@GautamGambhir) December 18, 2021
ఇక మనీశ్ పాండే ముందుగా మెరిసింది కేకేఆర్ లోనే. మనీశ్ ఐపీఎల్ లో మెరుపులు మెరిపించిన ఆ సమయంలో గంభీర్ కేకేఆర్ కెప్టెన్ గా వ్యవహరించాడు. కాబట్టి.. మనీష్ పాండే స్టామినా గంభీర్ కి బాగా తెలుసు. ఇక మనీష్ మొత్తం 154 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడి.. 3,560 పరుగులు చేశాడు. ఇందులో 21 అర్ధ శతకాలు కూడా ఉండటం విశేషం. ఇక ఐపీఎల్ లో సెంచరీ చేసిన ఘనత కూడా మనీష్ సొంతం. మరి.. సన్ రైజర్స్ టీమ్ లో అంతగా ఆకట్టుకొని మనీష్ పాండే పై గంభీర్ ఇంత నమ్మకంగా ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Former Zimbabwe captain and wicketkeeper Andy Flower will coach IPL’s Lucknow franchise.
Dr Sanjiv Goenka, Owner, Lucknow IPL team welcomed Andy to the RPSG family.#IndianPremierLeague #LucknowIPL #LucknowIPLTeam #Cricket #AndyFlower @IPL pic.twitter.com/RwTeony9ym
— RP Sanjiv Goenka Group (@rpsggroup) December 17, 2021