ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ కేకేఆర్‌పై విజయంతో 4వ గెలుపును సొంతం చేసుకుని ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. కాగా కోల్‌కత్తా నైట్ రైడర్స్ వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఓడి ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచి.. ముంబై, చెన్నై కంటే కొంచెం మెరుగ్గా ఉంది అంతే. గురువారం నాటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో దారుణంగా విఫలం అయిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లలో కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా రాణించడంతో ఆమాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ బౌలర్ శార్థుల్ ఠాకూర్ వేసిన ఒక బాల్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నితీష్ రాణా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఠాకూర్ వేసిన ఒక బంతి చేతినుంచి జారి వ్యతిరేక దిశలో వెళ్లింది. బౌలర్ వెనకు దూసుకెళ్లింది. దీంతో మైదనంలోని ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త డెలివరీ అని సోషల్‌మీడియాలో ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. శార్థుల్ బౌలింగ్‌పై ఒక రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు. కాగా శార్థుల్ వేసిన బాల్‌పై డేవిడ్ మాత్రం ఇచ్చిన రియాక్షన్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదేం బాల్‌రా బాబూ అన్నట్లు వార్నర్ నవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Umesh Yadav: స్టన్నింగ్ క్యాచ్‌తో పృథ్వీషాను గోల్డెన్ డక్‌గా వెనక్కి పంపిన ఉమేష్ యాదవ్
Lord Shardul Op 🔥✨ #KKRvDC pic.twitter.com/a1Ac7kjvQo
— Aatiksh (@Thatuniverseguy) April 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.