ఐపీఎల్ 2022లో ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తికావడంతో సీజన్ ముగింపునకు చేరుకుంటుంది. కొన్ని జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు ముందడుగు వేయగా, మరికొన్ని ప్లే ఆఫ్స్ చేరుకోవడానికి గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ టోర్నీలో అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) గురుంచి చెప్పొకోవాలి. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో టైటిల్ రేసులో మేమున్నామంటూ సత్తా చాటిన ఆర్‌సీబీ.. సెకండాఫ్‌లో హ్యాట్రిక్ పరాజయాలతో చతికిలపడింది. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ కు చేరుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో సునాయసంగా ప్లే ఆఫ్స్ చేరేలా కనిపించిన ఆర్‌సీబీ.. పేలవ ప్రదర్శనతో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 5 మాత్రమే గెలిచిన ఆ జట్టు.. ప్లే ఆఫ్స్ చేరాలంటే టోర్నీలో మిగిలిన నాలుగు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఆర్‌సీబీ తరువాత మ్యాచుల్లో.. చెన్నై, హైదరాబాద్, పంజాబ్, గుజరాత్ జట్లతో ఆడాల్సి ఉంది. ఈ నాలుగింటిలో విజయం సాధిస్తే 14 మ్యాచుల్లో 9 విజయాల(18 పాయింట్ల)తో ఎలాంటి టెన్షన్ లేకుండా ప్లే ఆఫ్స్ చేరుతుంది. అయితే ఈ నాలుగింటిలో ఒక్క మ్యాచ్ ఓడినా ఆ జట్టు క్లిష్టపరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఇతర జట్ల విజయావకాశాలపై ఆధారపడాల్సిందే.
4️⃣ Matches to go before the play offs and we are not giving it up yet!…#RCB pic.twitter.com/kkDp7R0fia
— VIRATian (@KingForever_18) May 2, 2022
ఇది కూడా చదవండి: Umran Malik: మరింత స్పీడ్ పెంచిన ఉమ్రాన్ మాలిక్! ఐపీఎల్‌లోనే నం.1
చెన్నై, హైదరాబాద్, పంజాబ్ జట్లతో గెలిచే అవకాశాలున్నా.. గుజరాత్ టైటాన్స్ పై గెలవాలంటే శక్తికిమించి పోరాడాల్సిందే. ఒక మ్యాచ్ ఓడింది అనుకుంటే 16 పాయింట్స్ ఉంటాయి. మెరుగైన రన్ రేట్ ఉంటే నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ఈ సారి కొత్తగా రెండు జట్లు రావడంతో 16 పాయింట్లను రెండు, మూడు టీమ్స్ సేమ్ పాయింట్లతో ఉండే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో నెట్ రన్ రేట్ కీలకం కానుంది. ప్రస్తుతం ఆర్‌సీబీ నెట్ రన్ రేట్(-0.558) నెగటీవ్‌గా ఉంది. దీన్ని మెరుగుపరుచుకోవాలంటే తరువాత మ్యాచుల్లో ఆర్‌సీబీ భారీ విజయాలు సాధించాల్సిందే. అయితే ఒక్కటి కంటే ఎక్కువ ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆవిరవుతాయి.
ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేస్తున్న జట్లు
ఈ సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఆడిన 9 మ్యాచుల్లో 8 విజయాల(16 పాయింట్లు)తో అగ్రస్థానంలో ఉంది. ఇక గుజరాత్ తరహాలోనే అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన మరో కొత్త జట్టు లక్నో జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన లక్నో 7 విజయాలు, 3 పరాజయాలతో రెండో స్థానంలో ఉంది. ఏదో అద్భుతాలు జరిగి ఈ రెండు జట్లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓటమిపాలైతే తప్ప ఈ సమీకరణలు మారకపోవచ్చు.
The support of our #TitansFAM powers us further… Keep the 💙 coming! #SeasonOfFirsts #AavaDe #TATAIPL pic.twitter.com/HGwGDjiwXn
— Gujarat Titans (@gujarat_titans) May 2, 2022
After another zabardast performance on Sunday, #SuperGiants continue to rise 💪🏼#AbApniBaariHai💪#IPL2022🏆 #bhaukaalmachadenge #lsg #LucknowSuperGiants #T20 #TataIPL pic.twitter.com/GsjtHlbL2K
— Lucknow Super Giants (@LucknowIPL) May 2, 2022
తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (9 మ్యాచుల్లో 6 విజయాలు, 3 పరాజయాలతో 12 పాయింట్లు), సన్‌రైజర్స్ (9 మ్యాచుల్లో 5 విజయాలు, 4 పరాజయాలతో 10 పాయింట్లు), ఆర్సీబీ (10 మ్యాచుల్లో 5 విజయాలు, 5 పరాజయాలతో 10 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (9 మ్యాచుల్లో 4 విజయాలు, 5 పరాజయాలతో 8 పాయింట్లు), పంజాబ్ (9 మ్యాచుల్లో 4 విజయాలు, 5 పరాజయాలతో 8 పాయింట్లు), కేకేఆర్ (9 మ్యాచుల్లో 3 విజయాలు, 6 పరాజయాలతో 6 పాయింట్లు), చెన్నై (9 మ్యాచుల్లో 3 విజయాలు, 6 పరాజయాలతో 6 పాయింట్లు), ముంబై (9 మ్యాచుల్లో ఓ విజయం, 8 పరాజయాలతో 2 పాయింట్లు) జట్లు వరుసగా ఉన్నాయి. మరి ఆర్సీబీ,ప్లే ఆఫ్స్ చేరుతుందా? లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Newbies continue to dominate the #IPL2022 points table. Which two sides will join them? pic.twitter.com/8Bi4mdIxoT
— 100MB (@100MasterBlastr) May 2, 2022