ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓడిపోయింది. మూడు వరుస విజయాల తర్వాత ఆర్సీబీ రెండో ఓటమిని చవిచూసింది. మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. స్టార్ పేసర్ హర్షల్ పటేల్ లేని లోటు తమకు తెలిసొచ్చిందని అన్నాడు. ఆరంభంలో 7-8 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేశాం. కానీ 8-14 ఓవర్ల మధ్య స్పిన్నర్లతో వేయించాం. చెన్నై బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా శివమ్ దూబే స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగాడు. మంచి భాగస్వామ్యంతో భారీ లక్ష్యాన్ని నిర్దేశించి మూమెంటమ్‌ను మార్చేశారు.
భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో మేము కూడా మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పాల్సింది. అలాగే టాప్-4 బ్యాట్స్‌మెన్ మంచి పునాది వేయాలి. దురదృష్టవశాత్తు మేం అది చేయలేకపోయాం. చెన్నై అద్భుతంగా బౌలింగ్ చేసింది. చెన్నై స్పిన్నర్లు పిచ్‌పై ఉన్న గ్రిప్‌ను అద్భుతంగా వాడుకున్నారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో మేం మూమెంటమ్ కోల్పోయాం. ఇక హర్షల్ పటేల్ లేని లోటు స్పష్టంగా తెలుసొచ్చింది. అతని సేవలను మేం చాలా మిస్సయ్యాం. మిడిల్ ఓవర్లలో అతని కట్టడి అయిన బౌలింగ్ లేకనే చెన్నై భారీ స్కోర్ చేసింది. అని అన్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. శివమ్ దూబె ( 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 నాటౌట్), రాబిన్ ఉతప్ప ( 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 88) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. అనంతరం బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్( 27 బంతుల్లో 4 ఫోర్లతో 41), సూయాశ్ ప్రభుదేశాయ్ ( 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34), దినేశ్ కార్తీక్ ( 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34) రాణించారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించుఉంటే.. ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలిచి ఉండేది. మరి ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి హర్షల్ పటేల్‌ను తీసుకోవపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ కోసం ధోని మాస్టర్ ప్లాన్! వర్క్ అవుట్ అయింది..
#IPL2022, #CSKvsRCB: @HarshalPatel23 has ability to stop the game, @RCBTweets missed that, admits skipper @faf1307 after defeat against @ChennaiIPL
READ: https://t.co/p3jnF4Enms #CSKvRCB #HarshalPatel #FafDuPlessis pic.twitter.com/8Y3mFCOXZb
— TOI Sports (@toisports) April 13, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.