ఐపీఎల్ 2022లో గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చెలరేగాడు. చాలా రోజుల ఫామ్‌లేమితో సతమతం అవుతున్న కోహ్లీ.. సూపర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ మునుపటిలా చెలరేగిన ఆడటంతో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 73 పరుగులతో వీరవిహారం చేశాడు. కోహ్లీకి తోడుగా ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (44పరుగులు 38బంతుల్లో 5ఫోర్లు) సమయోచితంగా ఆడాడు. ఇక చివర్లో మ్యాక్స్ వెల్ (40పరుగులు 18బంతుల్లో 5ఫోర్లు 2సిక్సర్లు నాటౌట్) తన మార్క్ హిట్టింగ్ చేశాడు. దీంతో ఆర్సీబీ అలవోకగా గుజరాత్ టైటాన్స్ పై గెలుపొందింది.
ఇక ఈ మ్యాచ్ గెలుపుతో తన ప్లేఆఫ్ ఆశలను ఆర్సీబీ సజీవంగా ఉంచుకున్నప్పటికీ ఆ జట్టు భవితవ్యం మాత్రం ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్‌పైనే ఉంది. ఆ మ్యాచ్‌లో ముంబై ఓడిపోతేనే ఆర్సీబీ ప్లేఆఫ్ చేరే వీలుంటుంది. ఢిల్లీ గెలిస్తే మాత్రం ఆర్సీబీ(-0.253)తో పోలిస్తే మంచి నెట్ రన్ రేట్ వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ చేరుతుంది. కాగా.. గుజరాత్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రాణించడంపై అతని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.
గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (62పరుగులు 47బంతుల్లో 4ఫోర్లు 3సిక్సర్లు నాటౌట్), డేవిడ్ మిల్లర్ (34పరుగులు 25బంతుల్లో 3సిక్సర్లు) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హెజల్‌వుడ్ 2, హసరంగా, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ తీసుకున్నారు. 169 పరుగుల టార్గెట్‌ను ఆర్సీబీ ఈజీగా చేజ్ చేసింది. కోహ్లీ 73, డుప్లెసిస్ 44, మ్యాక్స్‌వెల్ 40 నాటౌట్ రాణించడంతో ప్లేఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Shreyas Iyer: ఈ సీజన్‌లో KKR ఫెయిల్యూర్‌కు కారణాలు వివరించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
Awards galore for @imVkohli and @Gmaxi_32 after a memorable night at the Wankhede. 🤩👏🏻👏🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #RCBvGT pic.twitter.com/vfhfLufSsi
— Royal Challengers Bangalore (@RCBTweets) May 19, 2022