ఐపీఎల్ 2022లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గట్లు రాణించడంలేదు. ఈ సీజన్‌లో కోహ్లీ హైఎస్ట్ స్కోర్ 58. అది కూడా 53 బంతులాడి చేశాడు. పైగా ఈ సీజన్‌లో కోహ్లీకి రెండు వరుస గోల్డెన్ డక్స్ కూడా ఉన్నాయి. ఇంతటి దారుణమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. ఆడుతున్న చిన్న చిన్న ఇన్నింగ్స్‌లను కూడా చాలా అంటే చాలా స్లోగా ఆడుతున్నాడు. రన్ ఏబాల్ మాత్రమే స్కోర్ చేస్తున్నాడు. ఈ సీజన్ ఆరంభంలో తొలి 8 మ్యాచ్‌ల్లో వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ దారుణంగా విఫలం అయ్యాడు. దీంతో మూడు మ్యాచ్‌ల నుంచి ఓపెనర్‌గా వస్తున్నాడు.
మ్యాచ్ ఆరంభంలో 6 ఓవర్లు పవర్‌ప్లే ఉంటుంది. ఫీల్లర్లు ఇద్దరు మాత్రమే సర్కిల్ బయట ఉంటారు. దీంతో బ్యాటర్లకు పరుగులు చేయడం ఈజీ అవుతుంది. అయినా కూడా కోహ్లీ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ సీజన్‌లో సాధించిన ఏకైక హాఫ్ సెంచరీ కూడా 100 స్ట్రైక్‌రేట్‌తో చేసింది. ఇలాంటి స్ట్రైక్‌రేట్ టీ20 ఫార్మాట్‌కు పనికి రాదు. వరుస వికెట్లు పడి.. జట్టు కఠిన పరిస్థితుల్లో ఉన్న సమయాల్లో తప్పితే.. రన్ ఏబాల్ ఆడితే టీ20లో అంత ప్రభావం ఉండదు. పైగా కోహ్లీ లాంటి రన్ మెషీన్ ఇలాంటి స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం ఒకరకంగా ఆర్సీబీకి భారంగానే మారింది.
ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ చేసిన పరుగులు కేవలం 186. అది కూడా 111.09 స్ట్రైక్‌రేట్‌తో చేశాడు. ఐపీఎల్‌లో కోహ్లీ ఇంత తక్కువ స్ట్రైక్ రేట్ నమోదు చేయడం ఇదే తొలిసారి. మిడిల్ ఓవర్స్‌లో వికెట్లు పడకుండా కొంత ఆచితూచి ఆడే కోహ్లీ.. వన్డేల్లో అద్భుతంగా భాగస్వామ్యాలు నిర్మిస్తాడు. కానీ.. ఐపీఎల్‌లో చాలా సీజన్లలో ఓపెనర్‌గా కూడా వచ్చేవాడు. కానీ.. ప్రస్తుతం ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతుండడంతో.. ఓపెనర్‌గా వచ్చిన మెరుగైన స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. వన్‌డౌన్‌లో విఫలం అవుతున్నాడని.. ఆర్సీబీ జట్టులో అనుజ్ రావత్, పటిదార్ లాంటి మంచి ఓపెనర్లు ఉన్నా కూడా కోహ్లీకి ఉన్న ఇమేజ్‌కు అవకాశం కల్పించారు. కానీ.. కోహ్లీ స్లో బ్యాటింగ్‌తో ఆర్సీబీ భారీ స్కోర్లు చేయలేకపోతుంది.
ఎంతో ముఖ్యమైన పవర్‌ప్లేలో స్లాగ్ ఓవర్లలో వచ్చినట్లు పరుగులు వస్తుండడంతో మిడిల్డార్‌లో వచ్చే వారిపై ప్రెషర్ పడుతుంది. దీంతో వారు.. రన్‌రేట్ పెంచేందుకు రిస్క్ తీసుకుంటూ కొన్ని సార్లు వికెట్లు పారేసుకుంటున్నారు. కోహ్లీ ఒక్కసారి ఫామ్‌లోకి వస్తే.. ఏ స్థానంలో అయినా అదరగొడతాడు. కానీ.. ప్రస్తుతం ఫామ్‌లేమితో వన్‌డౌన్‌లో, ఓపెనర్‌గా కూడా విఫలం అవుతున్నాడు. ఇది జట్టుపై ఎంతో ప్రభావం చూపుతోంది. బుధవారం చెన్నై సూపర్ కింగ్సతో జరిగిన మ్యాచ్‌లో 30 పరుగుల చేసిన కోహ్లీ.. 33 బంతులను ఎదుర్కొన్నాడు. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఇంతటి స్లో బ్యాటింగ్ చేస్తుండడం అతని ఫ్యాన్స్ కూడా నచ్చడం లేదు. ఫామ్‌లో లేకున్నా.. టీ20 స్టైల్లో ఆడితేనే బౌలర్లపై ఒత్తిడి పెట్టొచ్చని… ఇలా వన్డేల్లో ఆడినట్లు ఆడితే కోహ్లీపైనే ప్రెషర్ ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: కోహ్లీని కొట్టి.. సారీ చెప్పిన CSK బౌలర్
Virat Kohli travelling in style in the new #RCBxPUMA Athleisure Collection. 😎🔥
Click on the link to get yours NOW: https://t.co/oxsut3sVmN 👊🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/iPsTfF5Uvd
— Royal Challengers Bangalore (@RCBTweets) May 3, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.