ఐపీఎల్ 2022లో ఏకైక ఎలిమినేటర్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. లీగ్ మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్, నాలుగో స్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు క్వాలిఫైయర్ 2లో ఆడేందుకు హోరాహోరీగా తలపడ్డాయి. చివరకు ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ సూపర్ విక్టరీని సాధించి.. రాజస్థాన్ రాయల్స్‌తో క్వాలిఫైయర్ 2లో పోటీపడనుంది. కాగా ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో ప్రార్థన చేస్తూ కనిపించాడు. ఈ సీజన్‌లో పెద్దగా పరుగులు చేయని కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో కూడా కేవలం 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఆ వెంటనే డేంజరస్ బ్యాటర్ మ్యాక్స్‌వెల్ కూడా అవుట్ అవ్వడంతో ఆర్సీబీ కనీసం నామమాత్రమైన స్కోర్ చేయగలదా అనే అనుమానాలు కలిగాయి. కానీ.. అప్పటికే సూపర్ టచ్‌లో ఉన్న కొత్త కుర్రాడు రజత్ పటీదార్, దినేష్ కార్తీక్ చెలరేగడంతో ఆర్సీబీ 207 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కానీ.. లక్నో బ్యాటర్లు కూడా అంతే ధీటుగా సమాధానం ఇస్తుండడంతో.. మ్యాచ్ ఆర్సీబీ చేజారిపోయేలా కనిపించింది. కానీ.. చివరకు మ్యాచ్ ఆర్సీబీ గెలవడంతో విరాట్ కోహ్లీ గట్టిగా ఊపిరిపీల్చుకున్నట్లు తెలుస్తుంది. అందుకే మ్యాచ్ అనంతరం ప్రార్థన చేస్తున్నట్లు ఆకాశం వైపు రెండు చేతులు చూపిస్తూ.. కళ్లు ముసుకుని దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కనిపించాడు. కోహ్లీ ఇలా దేవుడికి థ్యాంక్స్ చెప్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయి ఉంటే కోహ్లీపై కూడా చాలా విమర్శలు వచ్చేవి. అందుకే కోహ్లీ ఈ మ్యాచ్ గెలుపుతో ఇంతలా ఉపశమనం పొందాడు.
అలాగే గ్రౌండ్‌లో ఎప్పుడూ చాలా అగ్రెసివ్‌గా ఉండే కోహ్లీ.. ఇంత ప్రశాంతంగా కనిపించడం కూడా అరుదే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. మొహ్‌సిన్ ఖాన్ ఆర్సీబీని తొలి ఓవర్‌లోనే దారుణంగా దెబ్బతిశాడు. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్(0)ను తొలి ఓవర్ ఐదో బంతికి అవుట్ చేసి.. టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకున్న తన కెప్టెన్ నిర్ణయం సరైందే అని నిరూపించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ ఇన్సింగ్స్‌ను కొనసాగించాడు. కోహ్లీ నెమ్మదిగానే ఆడినా.. పటీదార్ మాత్రం ఎటాకింగ్ ప్లేతో లక్నో బౌలర్లకు చూక్కలు చూపించాడు. పటీదార్ 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో 112 పరుగులు చేసి అదరగొట్టాడు. దినేష్ కార్తీక్ 23 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్ 37 పరుగులు చేసి రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బౌలర్లలో మొహ్‌సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసుకున్నారు.
208 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన లక్నోను ఆర్సీబీ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తొలి ఓవర్‌లోనే దెబ్బకొట్టాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న క్వింటన్ డికాక్(6)ను తొలి ఓవర్‌లోనే అవుట్ చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 79 పరుగులు, దీపక్ హుడా 26 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సులతో 45 పరుగులు చేసి రాణించారు కానీ.. లక్నోకు విజయ తీరాలకు చేర్చలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లు 193 పరుగులు చేసి 14 రన్స్ తేడాతో ఓడింది. ఆర్సీబీ బౌలర్లలో హెజల్‌వుట్ 3, సిరాజ్, హసరంగా, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు. మరి ఈ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ చేసిన ప్రార్థనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Shikhar Dhawan: ధావన్‌ని పిచ్చికొట్టుడు కొట్టిన తండ్రి! వీడియో వైరల్!
These Virat Kohli’s pictures and reaction showed how meant this game for him. He looking to heaven and saying thankyou. pic.twitter.com/lZgP9epGUI
— CricketMAN2 (@ImTanujSingh) May 25, 2022