రెడ్ కలర్ జెర్సీలో విరాట్ కోహ్లీ ఐపీఎల్ కప్ ఎత్తాలని ఆర్బీసీ అభిమానులు ఎన్నో ఏళ్ల నుంచి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదన్న ఆ కల నెరవేరుతుందని గప్పెడాశలు పెట్టుకున్నారు. కానీ.. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడి.. మరోసారి అభిమానులను ఆర్సీబీ నిరాశపర్చింది. కానీ.. విరాట్ కోహ్లీ కప్ ఎత్తి.. ఆర్సీబీ టీమ్ మొత్తం హైరేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్న ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది. శుక్రవారం రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఆర్బీబీ ఓడినప్పటి నుంచి ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో ఓరిజినల్ ఫుల్‌బాల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఒక టీమ్ కప్పు ఎత్తే వీడియోను ఎడిట్ చేసి.. ఆర్సీబీ ఆటగాళ్లు కప్ గెలిచి సంబురాలు చేసుకున్నట్లు చేశారు. ప్రతిసారి కప్ కొడుతుందని ఆశ పడి భంగపడుతున్న ఆర్సీబీ అభిమానులకు ఈ వీడియో ఫన్నీగా అనిపిస్తుంది. వాళ్లు కూడా ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… ఏదో ఒక రోజు ఇలాంటి సీన్‌ను రియల్‌గా చూస్తాం అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇది చాలా పాత వీడియో.. కానీ శుక్రవారం ఆర్సీబీ ఐపీఎల్ 2022 నుంచి నిష్క‍్రమించడంతో మరోసారి వైరల్ అవుతోంది. కాగా.. విరాట్ కోమ్లీ 2011లో ఆర్సీబీ పగ్గాలు చేపట్టాడు. ఆ తర్వాత 2021 వరకు జట్టుకు కెప్టెన్ గా కొనసాగాడు. అయితే ఇప్పటి వరకు ఆర్సీబీ టీమ్ ఐపీఎల్ లో 8సార్లు ప్లే ఆఫ్స్ కు చేరింది. మొత్తం మూడుసార్లు ఫైనల్‌కు చేరి.. రన్నరప్ గా నిలిచింది. 2009, 2011, 2016 సంవత్సరాల్లో ఆర్సీబీ ఐపీఎల్ రన్నరప్‌గా నిలిచింది.
కోహ్లీ పగ్గాలు అందుకున్న మొదటి సంవత్సరంలోనే ఆర్సీబీని రెండో సారి ఫైనల్ చేర్చినా.. విజేతగా నిలపలేకపోయాడు. దీంతో 2021 సీజన్ మధ్యలోనే వచ్చే ఏడాది నుంచి తాను కెప్టెన్‌గా ఉండనంటూ ప్రకటన చేశాడు. దీంతో ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్‌ని నియమించింది. కెప్టెన్ మారితే లక్ మారుతుందని ఆశ పడ్డ ఆర్సీబీకి మరోసారి నిరాశే ఎదురైంది. ఇలా 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్సీబీ అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ ఫన్నీ ఎడిటెడ్ వీడియో చూసి మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆర్సీబీ కప్ గెలిస్తే.. ఇంతకంటే మించి సెలబ్రేషన్స్ ఉంటాయని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: ‘కోహ్లీ.. ఆడింది చాలు బ్యాగ్ సర్దుకో’! ఈ కామెంట్ చేసిన మాజీపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్
RCB fans celebrating the trophy of Winning Heart Liver Kidney for successive 15th Year💥#RCBvsRR #EeSalaCupNamde pic.twitter.com/wpYzzCu5An
— KKR Bhakt 🇮🇳 (@KKRSince2011) May 27, 2022
Sometimes you win, and sometimes you don’t, but the 12th Man Army, you have been fantastic, always backing us throughout our campaign. You make cricket special. The learning never stops. (1/2) pic.twitter.com/mRx4rslWFK
— Virat Kohli (@imVkohli) May 28, 2022