Virat Kohli: మరి ఇంత దురదృష్టమా? కోహ్లీకే ఎందుకిలా జరుగుతోంది?

ఐపీఎల్‌ 2022లో విరాట్‌ కోహ్లీని మరోసారి దురదృష్టం వెంటాడింది. శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మంచి టచ్‌లో కనిపించిన కోహ్లీ.. రెండు ఫోర్లు, ఒక సూపర్‌ సిక్స్‌తో వింటేజ్‌ కోహ్లీలా ఆడుతున్నాడు. ఇన్ని రోజులు ఫామ్‌లో లేని కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం చూడచక్కటి షాట్లు ఆడాడు. తన ఫేవరేట్‌ కవర్‌ డ్రైలు కూడా కొట్లాడు. ఇక ముందుకు వచ్చిన కొట్టిన సిక్స్‌ అయితే ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది. ఈ షాట్లు చూసిన ఫ్యాన్స్‌.. కోహ్లీ ఫామ్‌లోకి వచ్చేస్తున్నాడని మురిసిపోయారు.

కానీ.. రబడా బౌలింగ్‌లో ఊహించని రీతిలో అవుట్‌ అయ్యాడు. ఆ ఓవర్ రెండో బంతిని కగిసో రబడా షార్ట్ పిచ్‌గా వేయగా.. విరాట్ ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ స్లోవర్ బంతిని అంచనా వేయడంలో విరాట్ విఫలమయ్యాడు. దాంతో బంతి అతని థైప్యాడ్‌కు తాకి గాల్లోకి లేచి షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న రాహుల్ చాహర్ చేతిలో పడింది. దాంతో పంజాబ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. విరాట్ మాత్రం ఔట్ కాదని, డొక్కలో తాకిందని సైగ చేస్తూ ధీమాగా ఉన్నాడు. కానీ రిప్లేలో బంతి బ్యాట్‌ను మిస్సై అతని గ్లోవ్స్‌ను ముద్దాడినట్లు చిన్నపాటి స్పైక్‌ కనిపించింది.

స్నీకో మీటర్‌లో గీత రావడంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. బంతి బ్యాట్‌కు తగలకున్నా.. తన దురదృష్టం కారణంగా గ్లౌజ్స్‌కు బంతి రాసుకుంటూ పోయి ఔటవ్వడంపై విరాట్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆకాశం వైపు చూస్తూ ఆ దేవుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ఓ దేవుడా.. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది.’ అని గట్టిగా అరుస్తూ మైదానం వీడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ కాగా.. విరాట్ కోహ్లీ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోలేదని, పరిస్థితులు అతనికి ఏ మాత్రం కలిసి రావడం లేదని కామెంట్ చేస్తున్నారు.

కాగా.. క్రితం మ్యాచ్‌లోలానే విరాట్‌ కోహ్లీ ఈ మ్యాచ్‌లో కూడా నల్ల గ్రిప్‌ ఉన్న బ్యాట్‌తోనే బరిలోకి దిగాడు. గతంలో ఎప్పుడూ కోహ్లీ ఇలా నల్ల గ్రిప్‌తో ఉన్న బ్యాట్‌ వాడలేదు. ఈ నెల 8వ తేదీ ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కూడా కోహ్లీ నల్ల గ్రిప్‌ ఉన్న బ్యాట్‌తోనే ఆడాడు. ఆ మ్యాచ్‌లో కూడా కోహ్లీ డకౌట్‌ అయ్యాడు. అంతకు ముందు మ్యాచ్‌ల్లో కోహ్లీ తెల్ల గ్రిప్‌ ఉన్న బ్యాట్లు వాడే వాడు. కాలం కలిసి రావడం లేదని బ్యాట్‌ గ్రిప్‌ కలర్‌ను మార్చి ఉంటాడని సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అదే బ్యాట్‌ వాడిన కోహ్లీ మంచి టచ్‌లో కనిపించి దురదృష్టవశాత్తు అవుట్‌ అయ్యాడు. బ్యాట్‌ గ్రిప్‌ కలర్‌ మార్చిన కూడా రాత మారడం లేదని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

విరాట్ ఇలా దురదృష్టవశాత్తు ఔటవ్వడం ఇదే తొలిసారి కాదు. ఈ సీజన్‌లో అంపైర్ల తప్పిదానికి కూడా అతను బలయ్యాడు. విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌లు ఆడి కేవలం 236 పరుగులే చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉండగా.. మూడు మ్యాచ్‌ల్లో అతను గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే బ్యాటింగ్‌కు అనువైన తాజా మ్యాచ్‌లో మంచి టచ్‌లో కనిపించి, అద్భుతమైన షాట్లు ఆడిన తర్వాత కూడా ఔటవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్(42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70), జానీ బెయిర్ స్టో(29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.

ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు తీయగా.. హసరంగా రెండు వికెట్లు పడగొట్టాడు. షెహ్‌బాజ్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. భారీ లక్ష్యఛేదనలో ఆర్సీబీ తడబడింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసి 54 పరుగులు తేడాతో ఓటమి చవిచూసింది. ఇక మిగిలిన ఒక మ్యాచ్‌లో ఆర్సీబీ తప్పకగెలవాల్సి ఉంది. అందులో విజయం సాధిస్తేనే ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. మరి కోహ్లీ బ్యాట్‌ గ్రిప్‌ కలర్‌ మార్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Faf du Plessis: కోహ్లీ ఎలా ఆడిన అవుట్‌ అవుతున్నాడు: డుప్లెసిస్‌

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV