ఐపీఎల్ 2022లో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. విరాట్ కోహ్లీ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ.. ఎక్కువ బంతులు ఆడటంతో అదంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. రోహిత్ శర్మ ఫామ్‌తో పాటు జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఒకే ఒక్క విజయం సాధించి, ఏకంగా 8 మ్యాచ్‌ల్లో ఓడింది. రోహిత్, కోహ్లీ ప్రస్తుత పేలవ ఫామ్ చూసి.. భారత మాజీ కోచ్ రవిశాస్త్రితో సహా చాలా మంది క్రికెట్ ప్రముఖులు కోహ్లీ కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం కోహ్లీ ఆట కన్నా విశ్రాంతి తీసుకోవడమే మేలంటూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అయిన ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుత టఫ్ టైంలో కోహ్లీ తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. ముందున్న ఆసియా కప్ కోసం సన్నద్ధం కావాలంటే కోహ్లీ రిఫ్రెష్ కావాల్సిన అవసరముందన్నాడు. ఎంఎస్కే ప్రసాద్ అభిప్రాయం ప్రకారం.. ‘విరాట్ ఈ టైంలో సరైన విరామం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.
త్వరలో జరగబోయే ఆసియా కప్‌కు ముందు అతను రిఫ్రెష్ అయి అప్ అండ్ రన్నింగ్‌గా ఉండాలి. కేవలం కోహ్లీ మాత్రమే కాదు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్, టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రస్తుతం ఫామ్‌లో లేరు. రాబోయే టీ20 ప్రపంచ కప్ సమయంలో భారత లైనప్‌లో రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ అత్యంత ప్రధాన ఆటగాళ్లు. వాళ్లు ఆ టోర్నీ టైంకి తప్పకుండా రిఫ్రెష్ అయి ఉండాలి. బ్యాటింగ్ ఆర్డర్ పరంగా.. ఓపెనింగ్ స్లాట్‌లో శిఖర్ ధావన్ ఉండాలి. ధావన్ ప్రస్తుతం చక్కటి టచ్‌లో కన్పిస్తున్నాడని ప్రసాద్ అన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: కోహ్లీని కొట్టి.. సారీ చెప్పిన CSK బౌలర్
IPL 2022 | Virat Kohli should take a significant break from the sport and be fresh before the Asia Cup, says MSK Prasad https://t.co/RKL4nm47CW
— Wowbabytoys – E-news (@Wowbabytoys) May 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.