ఐపీఎల్ 2022లో యంగ్ ఇండియన్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్‌తో అందర్ని సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. కళ్లు చెదిరే వేగంతో బ్యాటర్లును బోత్తా కొట్టిస్తున్న ఉమ్రాన్.. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఒక అరుదైన ఘనత సాధించాడు. ఈ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన బాల్ వేసిన రికార్డు సృష్టించాడు. గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన ఉమ్రాన్ మాలిక్.. ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటికే ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ డెలివరీలు వేసిన ఉమ్రాన్ మాలిక్.. తన రికార్డునే మెరుగుపరుచుకున్నాడు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక వేగవంతమైన బాల్ 153.3 ఉమ్రాన్ మాలిక్ పేరు మీదనే ఉండగా.. ఇటీవల గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఫెర్గూసన్ దాన్ని 153.9 కిలో మీటర్ల వేగంతో అధిగమించాడు. తాజాగా ఉమ్రాన్ మాలిక్ 154 కిలోమీటర్ల వేగంతో టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చాడు. ఇలా తన ఎక్స్‌ప్రెస్ వేగంతో ఉమ్రాన్ మాలిక్ ఇప్పటివరకు ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లో ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డులను గెలుచుకోవడం విశేషం. ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఉమ్రాన్ మాలిక్ 7 ఫాస్టెస్ట్ అవార్డులను గెలుచుకున్నాడు. పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది ఆడే అన్ని మ్యాచ్‌ల్లో ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డులను గెలుచుకునేలా ఉన్నాడు.దీంతో మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన కనబర్చినా.. ఉమ్రాన్‌కు రూ.ఒక లక్ష ఖాయంగా వస్తుంది. కాగా జమ్మూకశ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్.. నెట్ బౌలర్‌గా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా వచ్చిన అవకాశంతో చెలరేగిపోతున్నాడు. దుబాయ్ వేదికగా జరిగిన గత సీజన్ సెకండాఫ్‌లో నటరాజన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఉమ్రాన్ వేగవంతమైన బంతులతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సారి మరింత మెరుగైన అతను ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను తన పేస్‌తో భయపెడుతున్నాడు. చెన్నైతో మ్యాచ్‌లో వికెట్ తీయకపోయినా.. తన స్పీడ్‌తో ఆకట్టుకున్నాడు. మరి ఉమ్రాన్ బౌలింగ్ స్పీడ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rahul Tewatia: గుజరాత్‌ను గెలిపిస్తున్న తెవాటియా.. టీమిండియాకు ఆడే టైమొచ్చిందా?
Swiggy Fastest Delivery of the Season #IPL2022 #UmranMalik @umran_malik_1 pic.twitter.com/BPNMP5nGoa
— Muhammad Siraj A I (@iam_craaaj) May 1, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.