ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ సూపర్ స్పీడ్‌తో బ్యాటర్లను భయపెడుతున్నాడు. ఇండియన్ బౌలర్లు ఇంత వరకు వేయని, ఊహించని స్పీడ్‌తో బౌలింగ్ వేస్తున్న ఈ యంగ్ గన్. తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు. ఈ సీజన్‌లో గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ కంటే ముందు అత్యంత వేగవంతమైన బంతి 154 కేఎంపీహెచ్. ఇదే ఇప్పటి వరకు రికార్డు. ఢిల్లీతో మ్యాచ్ కంటే ముందు చెన్నైతో మ్యాచ్‌లో ఉమ్రాన్ 154 వేగంతో బాల్ వేసి చరిత్ర సృష్టించాడు. గురువారం ఢిల్లీతో మ్యాచ్‌లో ఆ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా… ఇప్పట్లో బ్రేక్ కాలేని స్పీడ్‌తో బౌలింగ్ వేశాడు.. ఏకంగా 157 కేఎంపీహెచ్ వేగంతో బాల్ వేసి తన రికార్డును మళ్లీ తనే బ్రేక్ చేసి చరిత్ర సృష్టించాడు.
కాగా ఐపీఎల్‌లోనే అత్యంత వేగవంతమైన బంతిని ఢిల్లీ బ్యాటర్ రోమన్ పావెల్ బౌండరీకి తరలించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ నాలుగో బంతిని ఉమ్రాన్ ఈ రికార్డు స్పీడ్‌తో వేశాడు. ఆ తర్వాతి బంతిని కూడా ఉమ్రాన్ 156 వేగంతో వేశాడు. ఆ బంతికి కూడా పావెల్ ఫోర్ కొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలో 52 పరుగుల ఇచ్చాడు. కానీ.. ఐపీఎల్ 2022లో అత్యంత వేగవంతమైన బాల్ గంటకు 157 కిమీ వేగంతో బాల్ వేసి ఔరా అనిపించాడు. గతంలో 154 కిమీ వేగంతో బాల్ వేసినప్పుడు 155 కిమీ వేగంతో బాల్ కచ్చితంగా వేస్తానని చెప్పాడు. అన్న మాటను నిలబెట్టుకుంటూ ఏకంగా 157 కిమీ వేగంతో రికార్డు బాల్ వేశాడు. మరి ఉమ్రాన్ మాలిక్ స్పీడ్ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వికెట్ తీయకుండా భారీగా పరుగులిచ్చినా.. ఉమ్రాన్ మాలిక్‌కు రూ.లక్ష ఇస్తున్నారు ఎందుకని..?
Only Shaun Tait has bowled a faster delivery (157.71 kmph) than Umran Malik in the 15-year history of IPL.
📸: Disney+Hotstar#IPL2022 pic.twitter.com/gNFf6vo3lX
— CricTracker (@Cricketracker) May 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.