రెండున్నర నెలల పాటు క్రికెట్ అభిమానులకు అంతులేని వినోదాన్ని పంచిన ఐపీఎల్ 2022 సీజన్ ఆదివారంతో ముగిసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. ప్రతి సీజన్‌లాగే ఈ సీజన్‌లో కూడా కొంతమంది యువ క్రికెటర్లు తమకొచ్చిన అవకాశాలను అద్భుతంగా వినియోగించుకుని మంచి గుర్తింపుపొందారు. ఈ సీజన్‌లో ఫ్రాంచైజ్‌లకు తక్కువ ధరకే దొరికి.. కోట్లు పలికిన ఆటగాళ్ల కంటే మెరుగ్గా రాణించారు. అందులో టాప్ 10 జాబితా ఇదే..
1. తిలక్ వర్మ..
ఈ తెలుగు కుర్రాడు ముంబై ఇండియన్స్ లాంటి బిగ్ టీమ్‌లో భాగమయ్యాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రోహిత్ శర్మ, పొలార్డ్ లాంటి హేమాహేమీలు విఫలం అయిన చోట తన సతా చాటి అందరి దృష్టిని ఆకర్షించాడు. పైగా ముంబై ఇండియన్స్‌లో ఈ సీజన్‌కు టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రూ.1.7 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన తిలక్ 36.1 సగటుతో 397 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 131గా ఉంది. రెండు హాఫ్‌సెంచరీలు కూడా నమోదు చేశాడు.
2. మొహ్‌సిన్ ఖాన్..
ఈ సీజన్‌తో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ సభ్యుడైన మొహ్‌సిన్ ఖాన్‌కు టోర్నీ ఆరంభంలో తుది జట్టులో స్థానం దొరకలేదు. అతను జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే లక్నో బౌలింగ్ విభాగం పటిష్టమైంది. పైగా లెఫ్ట్‌ఆమ్ బౌలర్ కావడంతో మరింత ప్రభావం చూపాడు. మొహసిన్ ఖాన్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ కేవలం రూ.20 లక్షలకే కొనుగోలు చేసింది. మొహ్‌సిన్ 2018 నుంచి ఐపీఎల్‌లో ఉన్నా తుది జట్టులో చోటు దక్కలేదు. 2018లో ముంబై ఇండియన్స్ మొహ్‌సిన్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన మొహ్‌సిన్ 5.97 ఎకనామీతో 14 వికెట్లు తీసి ఔరా అనిపించాడు.
13. రజత్ పటీదార్..
ఈ సీజన్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు దొరికిన ఒక ఆణిముత్యం రజత్ పటీదార్. నిజానికి పటీదార్‌ను ఆర్సీబీ ఐపీఎల్ మెగా వేలంలో కొనుగోలు చేయలేదు. ఆర్సీబీ యువ ప్లేయర్ లువ్‌నీత్ సిసోడియా గాయపడటంతో అతని ప్లేస్‌లో రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంది. ఇలా అదృష్టంతో వచ్చిన అవకాశాన్ని పటీదార్ రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. గత సీజన్‌లో ముందు ఆర్సీబీకే ఆడిన పటీదార్ పెద్దగా రాణించలేదు. కానీ ఈ సీజన్‌లో తన సత్తా ఏంటో చూపించాడు. ఆర్సీబీ ఇతన్ని రూ.20 లక్షలకు తీసుకుంది. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన పటీదార్ 55.50 సగటుతో 333 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
4. ముఖేష్ చౌదరి..
చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన ముఖేష్ చౌదరి మంచి బౌలింగ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ చెత్త ప్రదర్శనతో నిరాశపర్చినా.. ముఖేష్ చౌదరి ప్రదర్శనపై ప్రశంసలు కురిశాయి. మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన ముఖేష్ 16 వికెట్లు పడగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ ముఖేష్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
5. రింకూ సింగ్..
కోల్‌కత్తా నైట్ రైడర్స్‌లో 2018 నుంచి ఉన్న రింకూసింగ్‌కు సరైన అవకాశాలు రాలేదు. కానీ ఏడాది కేకేఆర్‌లో చేసిన అనేక మార్పుల కారణంగా రింకూ సింగ్‌కు తుది జట్టులో స్థానం దక్కింది. రింకూ కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన రింకూ 174 పరుగులు చేశాడు. తన పవర్ హిట్టింగ్‌తో ఒక మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. కేకేఆర్ ఇతన్ని రూ.55 లక్షలకు కొనుగోలు చేసింది.
6. ఆయూష్ బదోని..
లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడిన కుర్రాడు ఆయూష్ బదోని తన పవర్ హిట్టింగ్‌తో ఇండియన్ బేబీ ఏబీగా కూడా పేరు తెచ్చుకున్నాడు. బదోనిని లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్ పట్టుకొచ్చాడు. గంభీర్ పెట్టుకున్న నమ్మకానికి బదోని వందశాతం న్యాయం చేశాడు. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి 161 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్‌సెంచరీ కూడా ఉంది. లక్నో ఇతన్ని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
7.జితేష్ శర్మ..
పంజాబ్ కింగ్స్‌కు ఆడిన జితేష్ శర్మ.. డెత్ ఓవర్స్‌లో అద్భుతమైన షాట్లు ఆడి ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన జితేష్.. 163.64 స్ట్రైక్‌రేట్‌తో 234 పరుగులు చేశాడు. జితేష్ శర్మను పంజాబ్ కింగ్స్ రూ.20లక్షలకు కొనుగోలు చేసింది.
8. సాయి సుదర్శన్..
ఐపీఎల్ 2022లో ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన సాయి సుదర్శన్ తక్కువ మ్యాచ్‌లు ఆడి మంచి ప్రదర్శన కనబర్చాడు. ఈ సీజన్‌లో 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సాయి.. 127.19 స్ట్రైక్‌రేట్‌తో 145 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. గుజరాత్ టైటాన్స్ సాయిని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
9. రమణ్‌దీప్ సింగ్..
ముంబై ఇండియన్స్‌కు ఆడిన రమణ్‌దీప్ సింగ్ డెత్ ఓవర్స్‌లో బుమ్రాకు తోడుగా మంచి బౌలింగ్‌తో అదరగొట్టాడు. ముంబై దారుణ ప్రదర్శన కనబర్చినా.. రమణ్‌దీప్‌సింగ్ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన రమణ్‌దీప్ 6 వికెట్లు పడగొట్టాడు. ఇతన్ని ముంబై రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
10. కుల్దీప్ సేన్..
ఐపీఎల్ 2022లో రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన కుల్దీప్ సేన్ మంచి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ సేన్ 8 వికెట్లు తీశాడు. ఇందులో ఒక 4 వికెట్స్ హాల్ కూడా ఉంది. కాగా రాజస్థాన్ కుల్దీప్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఇలా ఈ పది మంది ఆటగాళ్లు.. తక్కువ ధరకే ఆయా ఫ్రాంచైజ్‌లకు దక్కారు. కానీ.. వారి ప్రదర్శనతో మంచి మార్కులు కొట్టేశారు. భవిష్యత్తులో ఈ ఆటగాళ్లకు భారీ డిమాండ్ ఉండనుంది. మరి ఈ 10 మంది ఆటగాళ్ల ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Hardik Pandya: రోహిత్ కెప్టెన్సీకి ఎసరు పెట్టిన హార్దిక్ పాండ్యా..!
Came in as a replacement player, owned the stage like a 🌟🔥
Drop a ❤️ if you enjoyed watching Rajat bat fearlessly in #IPL2022, 12th Man Army! #PlayBold #WeAreChallengers pic.twitter.com/inWVS7H7vh
— Royal Challengers Bangalore (@RCBTweets) May 30, 2022
.@sachin_rt is all praise for the young Tilak Varma.#IPL2022 pic.twitter.com/d4SnrnQmiU
— 100MB (@100MasterBlastr) May 27, 2022