ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఈ సీజన్ ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌కు బ్రేకులు వేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో జీటీపై సన్‌రైజర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్‌తో SRHకు ఒక షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టు దూరం అయ్యాడు. గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడం కష్టమే. ఎన్ని మ్యాచ్‌లకు అతను దూరం అవుతాడనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
కనీసం రెండు వారాల పాటు అతను విశ్రాంతి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు వారాల వ్యవధిలో జరిగే మ్యాచ్‌లల్లో వాషింగ్టన్ సుందర్ ఆడకపోవచ్చు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. ఫలితంగా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయాడు. మూడు ఓవర్లే వేశాడు. అర్ధాంతరంగా డ్రెస్సింగ్‌రూమ్‌కు చేరుకున్నాడు. మిగిలిన ఆ ఒక్క ఓవర్‌ను మార్క్‌రమ్ పూర్తి చేశాడు. సుందర్ కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలు మధ్య గాయం అయినట్లు సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ అతను వేలిగాయంతో బాధపడ్డాడు. ఆ సీజన్‌తో పాటు భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కూ దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. సుందర్.. కనీసం రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవచ్చని హైదరాబాద్ హెడ్ కోచ్ టామ్ మూడీ ధృవీకరించారు. అతని స్థానంలో శ్రేయాస్ గోపాల్ లేదా జగదీష్ సుచిత్‌ను తుదిజట్టులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది.
బ్యాటర్ రాహుల్ త్రిపాఠి పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతను గాయపడ్డాడు. రిటైర్డ్ హర్ట్‌గా క్రీజ్‌ను వీడాడు. 11 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 17 పరుగులు చేసి, ఊపు మీదున్న దశలో త్రిపాఠి వెనుదిరగాల్సి వచ్చింది. అతని గాయం చిన్నదేనని, దీని పట్ల పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదని, తరువాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని టామ్ మూడీ చెప్పారు. మరి సన్‌రైజర్స్ ఆటగాళ్ల గాయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022లో రెండో గెలుపు సాధించిన SRH.. అత్యంత చెత్త రికార్డ్ సొంతం!
The #Risers go back-to-back! 🧡
Here’s a recap of another impressive win, last night. 💪 #SRHvGT #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/GpFIBp6QzV
— SunRisers Hyderabad (@SunRisers) April 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.