విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్ మెన్. వరల్డ్ క్లాస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించి, టన్నుల్లో పరుగుల వరద పారించిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్. అయితే అదంతా గతం. ఇప్పుడు విరాట్ కోహ్లీ పరిస్థితి వేరు. కెప్టెన్సీ వదులుకున్నాడుగా, ఈ సారి వీర లెవెల్లో రెచ్చిపోయి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలుస్తాడని అందరూ భావించారు. అయితే.. సీన్ రివర్స్ లో జరుగుతోంది. క్రీజులోకి వెళ్తున్న కోహ్లీ ఎండ వేడికి తట్టుకోలేక పోతున్నాడో.. ఏమో.. డకౌట్ అయ్యి వెనుక్కు వస్తున్నాడు
వాంఖడే వేదికగా జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచులో తొలి బంతికే వికెట్ పడింది. ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. సన్‌రైజర్స్ అటాక్ ఆరంభించిన మైసూర్ బౌలర్ జగదీశ్ సుచిత్ తొలి బంతికే విరాట్ కోహ్లిని డకౌట్ చేసి పెవిలియన్ బాట పట్టించాడు. టీ20 లీగ్ లో కోహ్లీ ఇప్పటివరకు 6 సార్లు డకౌట్ కాగా.. ఇందులో మూడు ఈ సీజన్ లోవే గమనార్హం. రెండు సార్లు హైదరాబాద్ తోనే డకౌట్ గా వెనుదిరిగాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు 12 మ్యాచులాడిన కోహ్లీ 216 పరుగులు చేయగా.. హైయెస్ట్ స్కోర్ 58 పరుగులు.
కాగా ఈ సీజన్‌లో ఆడిన 11 మ్యాచ్‌లలో ఆర్సీబీ 6 విజయాలు సాధించి.. 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు హైదరాబాద్ జట్టు పదింట 5 విజయాలతో 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ రేసులో ముందుకు వెళ్లాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
That wasn’t even a wicket taking bowl #Kohli#Kohli pic.twitter.com/yB2zPkOlGM
— kiran1432 (@SaiKiranAddala3) May 8, 2022
WICKET FIRST BALLL!!!! YES SUCHITH!!!! 🔥🔥🔥🔥
— SunRisers Hyderabad (@SunRisers) May 8, 2022
Virat Kohli in IPL:
Golden ducks from 2008-2021: 3
Golden ducks in IPL 2022: 3#IPL2022 #RCBvSRH #Kohli pic.twitter.com/SUCx9ymt08
— Wisden India (@WisdenIndia) May 8, 2022
ఇది కూడా చదవండి: Chris Gayle: ఐపీఎల్ పై యూనివర్సల్ బాస్ ‘క్రిస్ గేల్’ షాకింగ్ కామెంట్స్!