ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు నాసిరకం బౌలింగ్ తో తేలిపోయారు. సీజన్ తొలి భాగంలో నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపెట్టిన ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు.. తర్వాత వరుసగా తేలిపోతున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ల వైఫల్యాన్ని ఆర్సీబీ బ్యాటర్లు రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. ఇక.. దినేష్ కార్తీక్ అయితే ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడనే చెప్పాలి.
19వ ఓవర్ రెండో బంతికి మాక్సీ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తిక్ అద్బుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఎనిమిది బంతులు ఎదుర్కొన్న డీకే 1 ఫోర్, 4 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో నాలుగు బంతులు ఎదుర్కున్న దినేష్ కార్తీక్ మూడు సిక్సులు, ఓక ఫోర్ బాదాడు. దినేష్ కార్తీక్ మెరుపులతో బెంగళూరు జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో జగదీష్ సుచిత్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. కార్తీక్ త్యాగి ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఎస్‌ఆర్‌హెచ్ గెలవాలంటే 20 ఓవర్లలో 193 పరుగులు చేయాల్సి ఉంటుంది.
Dinesh Karthik’s Innings:-
Runs – 30*
Balls – 8
Strike Rate – 375Last 6 balls – 2,6,6,6,6,4 – 30*(6). Incredible just Incredible DK. pic.twitter.com/GgEha4Mp9B
— CricketMAN2 (@ImTanujSingh) May 8, 2022
Dinesh Karthik is an absolute treasure 🔥🔥🔥 So exciting every time he comes to the middle! Gives ya more than enough of a reason to cheer at the top of your lungs from your couch! #SRHvRCB
— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) May 8, 2022
Contributions from Faf, Patidar, Maxi and DK’s blitz at the end help us put up a formidable total on a two-paced wicket. 💪🏻
Time for our bowlers to put on a show now! 🙌🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #GoGreen #ForPlanetEarth #SRHvRCB pic.twitter.com/w2HC1Qgn0z
— Royal Challengers Bangalore (@RCBTweets) May 8, 2022
ఇది కూడా చదవండి: Chris Gayle: ఐపీఎల్ పై యూనివర్సల్ బాస్ ‘క్రిస్ గేల్’ షాకింగ్ కామెంట్స్!