ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత తడబడ్డ తర్వాత.. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో అద్భుత విజయం సాధించి మళ్లీ రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసింది. అయినా కూడా ఈ సీజన్‌లో SRH మెరుగైన స్థానంలోనే ఉంది. కాగా.. ఆ జట్టు బౌలర్ సౌరభ్ దూబే గాయం కారణంగా ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దూబేను సన్‌రైజర్స్ రూ.20 లక్షలకు ఐపీఎల్ మెగా వేలంలో కొనుగోలు చేసింది. కానీ.. అతనికి తుది జట్టులో స్థానం లభించలేదు. దూబేకు ఈ సీజన్‌లో మ్యాచ్ ఆడే అవకాశం రాకుండానే గాయంతో అతను టోర్నీకి దూరమయ్యాడు.
ఇప్పటికే సూపర్ బౌలింగ్‌తో టోర్నీలో అదరగొడుతున్న సన్‌రైజర్స్.. దూబే స్థానంలో మరో లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్‌ను తీసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వచ్చిన రాంచీ నగరానికి చెందిన సుశాంత్ మిశ్రాను రూ.20 లక్షలకు సన్‌రైజర్స్‌జట్టులోకి తీసుకుంది. 21 ఏళ్ల మిశ్రా ఫస్ట్ క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. సుశాంత్ గతంలో ఆర్సీబీ జట్టులో నెట్ బౌలర్‌గా ఉన్నాడు. ఇప్పుడు సన్‌రైజర్స్ జట్టులో సభ్యుడిగా చేరాడు. ప్రస్తుతం ఏ జట్టుకు లేని బౌలింగ్ ఎటాక్ సన్‌రైజర్స్‌కు ఉంది. టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, జన్‌సేన్ అద్భుతంగా రాణిస్తున్నారు. కాగా.. మిశ్రాకు కూడా తుది జట్టులో స్థానం దక్కడం కష్టమే. కానీ సీనియర్లతో కలిసి నెట్స్ ప్రాక్టీస్‌లో పాల్గొనడం ద్వారా అతని మంచి సలహాలు, సూచనలు దొరుకుతాయి. అలాగే విలియమ్సన్, మార్కరమ్, పూరన్ లాంటి అంతర్జాతీయ క్రికెటర్లకు బౌలింగ్ చేసే అవకాశం కూడా వస్తుంది. దీంతో అతను మరింత రాటుదేలే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: కోహ్లీని కొట్టి.. సారీ చెప్పిన CSK బౌలర్
Our newest #Riser has joined the Orange Camp. 🧡#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/pTMAbSV3tX
— SunRisers Hyderabad (@SunRisers) May 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.