ఐపీఎల్ 2022లో గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 54 బంతుల్లో 8ఫోర్లు, 2 సిక్సులతో 73 పరుగులు చేసి ఆర్సీబీని గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్‌తో మునుపటి కోహ్లీని గుర్తుచేశాడు. తన ఫామ్‌లో ఉండి ఆడితే ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి ఫామ్‌లేమితో , గోల్డెన్ డక్‌లతో ఇబ్బంది పడుతున్న కోహ్లీ మొత్తానికి కీలక మ్యాచ్‌లో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఆర్సీబీ తన ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
అలాగే పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ దారులను ముసేసింది. దీంతో పంజాబ్, సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కోహ్లీ ఫామ్‌లోకి రావడంపై అంతగా హ్యాపీగా లేరు. అబ్బా కోహ్లీ.. ఈ మ్యాచ్‌లోనే నువ్వు ఫామ్‌లోకి రావాలా అంటూ పెదవి విరుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయి ఉంటే.. ఆ రెండు జట్లకు కూడా ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండేవి. ఆర్సీబీ ఈ గెలుపుతో పాయింట్లను 16కు పెంచుకుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్, పంజాబ్ 12 పాయింట్లతో ఉన్నారు. వారికి చెరోమ్యాచ్ మిగిలి ఉంది. ఇప్పుడు ఆ రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌లో విజయం సాధించినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (62పరుగులు 47బంతుల్లో 4ఫోర్లు 3సిక్సర్లు నాటౌట్), డేవిడ్ మిల్లర్ (34పరుగులు 25బంతుల్లో 3సిక్సర్లు) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హెజల్‌వుడ్ 2, హసరంగా, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ తీసుకున్నారు. 169 పరుగుల టార్గెట్‌ను ఆర్సీబీ ఈజీగా చేజ్ చేసింది. కోహ్లీ 73, డుప్లెసిస్ 44, మ్యాక్స్‌వెల్ 40 నాటౌట్ రాణించడంతో ప్లేఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. మరి పంజాబ్, సన్‌రైజర్స్ ప్లేఆఫ్ అవకాశాలపై ఆర్సీబీ, కోహ్లీ చూపిన ప్రభావంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: ప్రపంచ క్రికెట్‌లో ఏ క్రికెటర్‌కు సాధ్యం కానీ రికార్డు సాధించిన కోహ్లీ!
Virat Kohli reaches fifty with his FIRST EVER six against Rashid Khan 😲#IPL2022 #RCBvsGT pic.twitter.com/1ACOfRXFBw
— ESPNcricinfo (@ESPNcricinfo) May 19, 2022