ఐపీఎల్ 2022లో సోమవారం కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హైస్కోరింగ్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. కానీ చివరికి పరాజయం కేకేఆర్‌ను వెక్కిరించింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను స్వీయ తప్పిదాలతో కేకేఆర్ చేజార్చుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహనం కోల్పోయాడు. సహచర బ్యాట్స్‌మన్ వెంకటేశ్ అయ్యర్ చేసిన పనికి చిర్రెత్తుకుపోయిన శ్రేయస్.. అతనిపై తిట్లతో విరుచుకుపడ్డాడు.
ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్ రనౌటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. ఆ ఓవర్ చివరి బంతిని బౌల్ట్ ఫుల్లర్ లెంగ్త్‌గా వేయగా… వెంకటేశ్ అయ్యర్ డీప్ కవర్ దిశగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హెట్‌మేయిర్ బంతిని వేగంగా అందుకొని కీపర్‌కు విసిరాడు. అయితే అప్పటికే సింగిల్ తీసిన శ్రేయస్.. క్విక్ డబుల్ కోసం ప్రయత్నించాడు. వెంకటేశ్ సైతం లేట్‌గా రెస్పాండ్ అయి.. తర్వాత నో చెప్పడంతో అయ్యర్ ఆగ్రహానికి గురయ్యాడు. కోపంతో అయ్యర్‌పై నోరుపారేసుకున్నాడు. నిజానికి అప్పటివరకు ఒంటరి పోరాటం చేస్తున్న శ్రేయస్ అయ్యర్ వికెట్ చాలా కీలకంగా మారింది. అందుకే శ్రేయస్ అంత అగ్రెసివ్‌గా రియాక్ట్ అయ్యాడు.కాగా ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే భారీ టార్గెట్. జోస్ బట్లర్(61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 103) ఈ సీజన్‌లో రెండో సెంచరీ బాదేశాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 210 పరుగులకు కుప్పకూలింది. శ్రేయస్ అయ్యర్(51 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 85), ఆరోన్ ఫించ్(28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్(5/40) హ్యాట్రిక్‌తో పాటు తొలిసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. మరి కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL ఫిక్సింగ్ అనే వారికి ఇదే సమాధానం!
— Addicric (@addicric) April 18, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.