ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశకు చేరుకుంది. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మాత్రమే టైటిల్ వేటలో మిగిలాయి. మిగిలిన జట్లు ఇంటిదారి పట్టాయి. అయితే పంజాబ్ కింగ్స్, ఎప్పటిలాగే గత మూడు సీజన్ల ఆనవాయితీని కొనసాగిస్తూ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. శిఖర్ ధావన్ 14 మ్యాచుల్లో 38.33 సగటుతో 460 పరుగులు చేసినా తన జట్టును ప్లేఆఫ్స్‌కి చేర్చలేకపోయాడు. ఈ క్రమంలో ఇంటికి చేరుకున్న శిఖర్ ధావన్ ఫన్నీ వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.
పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించకపోవడంతో గబ్బర్ స్వగ్రామానికి చేరుకున్నాడు. తన తండ్రితో కలిసి వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ‘ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై కాకుండా ఇంటికి తిరిగి వచ్చినందుకు మా నాన్న ఇలా కొడుతున్నాడంటూ..’ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియోలో ధావన్ తండ్రి మహేంద్ర పాల్.. ధావన్ ను చేతులతో కొడుతూ కింద పడేసి కాళ్లతో తొక్కుతూ తన్నుతున్నట్టు నటించాడు. ఓ పాత బాలీవుడ్ సినిమా క్లిప్ ను స్ఫూర్తిగా తీసుకుని ఈ రీల్ చేశాడు ధావన్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాతో పాటు మరికొందరు పంజాబ్ ఆటగాళ్లు లైక్ చేయడం గమనార్హం.
ఇది కూడా చదవండి: Rohit Sharma-Ritika Sajdeh: భార్యతో కలిసి మాల్దీవుల్లో రోహిత్ శర్మ..! ఫొటోస్ వైరల్!
ఇక.. ఐపీఎల్‌లో 400+ పైగా పరుగులు చేయడం శిఖర్ ధావన్‌కి ఇది 8వ సారి. గత 12 సీజన్లుగా ప్రతీ సీజన్‌లోనూ 300+ పరుగులు చేస్తూ నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు ధావన్. అయితే .. త్వరలో సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో ధావన్ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా వంటి సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో . దీంతో ధావన్‌కి కెప్టెన్సీ దక్కవచ్చని భావించారంతా. అయితే ధావన్‌కి కాకుండా సౌతాఫ్రికా టూర్‌లో కెప్టెన్‌గా వన్డే సిరీస్‌లో వైట్ వాష్ చేసిన కెఎల్ రాహుల్‌కి మరోసారి అవకాశం ఇచ్చింది బీసీసీఐ.