ఐపీఎల్ 2022 సీజన్ లో సెంచరీల మోత మోగిస్తూ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్.. ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జోస్ బట్లర్.. స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. గాల్లోకి ఎగురుతూ సింగిల్ హ్యాండ్‌తో పట్టిన క్యాచ్.. మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ క్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగగా.. పంజాబ్ ఓపెనర్లు జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్ మంచి శుభారంభం అందించారు. ధావన్ నిదానంగా ఆడిన బెయిర్ స్టో ధాటిగా ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టాడు. 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. 6ఓవర్ వేయడానికి బాల్ అందుకున్న అశ్విన్ తొలి బంతికే రాజస్థాన్‌కు మంచి బ్రేక్ త్రూ అందించాడు. అతను వేసిన మొదటి బంతిని ధావన్ ఓవర్ మిడాన్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ దిశలో సర్కిల్‌పై ఫీల్డింగ్ చేస్తున్న జోస్ బట్లర్ అద్భుతంగా గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్.. ఐపీఎల్ 2022 సీజన్ బెస్ట్ క్యాచ్‌ల్లో ఒకటిగా నిలవనుంది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
What a catch jos buttler😈
It’s a classic 😍😍#rrvspbks #JosButtler pic.twitter.com/0eYGtjr8pY— Rohit Kumar (@skipper_kohli) May 7, 2022
Jos buttler😇
*scoring runs
*taking stunning catches on field
*taking rajasthan forward single handedly
Totally giving a glimpse of virat kohli 2016 edition…Retweet if you agree!!#JosButtler #IPL20222 #ViratKohli #ipl2016 pic.twitter.com/3ZOPnWyz2b
— Devansh Awasthi (@Devansh67960583) May 7, 2022
ఇది కూడా చదవండి: Virender Sehwag: వార్నర్ కు అందరితో గొడవలే.. సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్
ఇక జోస్ బట్లర్ సూపర్ క్యాచ్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. వాటే క్యాచ్.. క్రికెట్‌లో సూపర్ మ్యాన్ ఎవరో తెలిసిపోయిందని కామెంట్ చేస్తున్నారు. జోస్ క్యాచ్‌ను ఉద్దేశిస్తూ సొంత ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్ కూడా సెటైర్లు పేల్చాడు. ఓ మై గాడ్.. ఇలా క్యాచ్‌లు పట్టడం చట్టరీత్యా నేరం అని కామెంట్ చేశాడు.
OMG, WHAT??!! JOS BUTTLER, THAT IS ILLEGAL! 🔥
— Rajasthan Royals (@rajasthanroyals) May 7, 2022
What do you think? 🤔#IPL #IPL2022 #TATAIPL #PBKSvRR #RRvPBKS #JosButtler #ViratKohli pic.twitter.com/YY5JfusLNZ
— CricBouncer (@Cricket_Bouncer) May 7, 2022