ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. సౌతాఫ్రికా అండర్ 19 ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ ముంబై ఇండియన్స తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. పంజాబ్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఈ ప్రొటీస్ కుర్రాడు అదరగొట్టాడు. కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సులతో 49 పరుగులు చేశాడు. ప్రారంభంలో 8 బంతులు డాట్ బాల్స్ ఆడిన బ్రెవిస్.. ఆ తర్వాత విధ్వంసం సృష్టించాడు.
ముఖ్యంగా పంజాబ్ బౌలర్ రాహుల్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో చివరి నాలుగు బంతుల్లో 4 సిక్సులు బాదాడు. దాంతో ఆ ఓవర్‌లో ఏకంగా 29 పరుగులు వచ్చాయి. దీంతో బ్రెవిస్ హిట్టింగ్‌కు ఫిదా అయిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. స్ట్రటజిక్ టైమ్ అవుట్ సమయంలో గ్రౌండ్‌లోకి పరిగెత్తుకొచ్చి.. బ్రెవిస్‌ను అభినందించాడు. ఏకంగా కెప్టెనే వచ్చి అభినందించడంతో బ్రెవిస్‌కు ఆనందంతో ఉబ్బితబ్బియయ్యాడు. సాధారణంగా మ్యాచ్ ముగిసేంత వరకు చాలా గంభీరంగా ఉండే రోహిత్ ఇలా సంతోషం పట్టలేక గ్రౌండ్‌లోకి వచ్చి మరీ ఒక యువ క్రికెటర్‌ను అభినందించడం విశేషం.
కాగా ఈ మ్యాచ్‌లో కూడా ముంబై ఓడింది. 12 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 49 పరుగులు చేసిన బ్రెవిస్ అర్షదీప్ బౌలింగ్‌లో ఒడియన్‌స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ గెలిపించేలా కనిపించానా.. అతను కూడా అవుట్ అవ్వడంతో ముంబైకు ఓటమి తప్పలేద. ఈ ఓటమితో ముంబైకి ఈ సీజన్‌లో వరుసగా ఐదో ఓటమి ఎదురైంది. 2014లో కూడా ముంబై తొలి ఐదు మ్యాచ్‌లను ఓడింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Captain Rohit Sharma appreciates young Dewald Brevis for his brutal hitting
(📸Credit: BCCI/IPL)#RohitSharma #DewaldBrevis #MIvPBKS #MI #MumbaiIndians #IPL #IPL2022 #Cricket #CricketTwitter | @mipaltan pic.twitter.com/eZrBvakMrd
— SportsTiger (@sportstigerapp) April 13, 2022
ఇదీ చదవండి: ముంబై కొంపముంచిన సూర్య కుమార్ యాదవ్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.