టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. కేవలం 268 పరుగులు మాత్రమే సాధించాడు. అంతేకాకుండా తన ఐపీఎల్ కెరీర్‌లో ఒక్క అర్ధసెంచరీ కూడా సాధించకుండా సీజన్‌ను రోహిత్ ముగించడం ఇదే తొలిసారి. ఒకవైపు బయో బాబుల్.. మరోవైపు ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో విసిగిపోయిన రోహిత్.. ఆ మూడ్ నుంచి బయటపడేందుకు భార్యతో కలిసి మాల్దీవుల్లో టూర్ ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
మాల్దీవ్స్ టూర్ లో.. భార్య రితికాతో రొమాంటిక్ ఫోటో దిగిన రోహిత్.. ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. పోస్టు చేస్తూ దానికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. మరికొన్ని రోజులు ఇలాంటి ఏకాంతం కావాలన్న ఉద్దేశాన్ని రోహిత్ తన పోస్టులో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇది కూడా చదవండి: Suryakumar Yadav: సూర్య.. ఇలా అయితే పరాగ్ ఓవరాక్షన్ ఎక్కువ అవుద్ది! నెటిజన్స్ కౌంటర్లు!
ఇక.. ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ జట్టు చివరి స్థానంలో నిలిచింది. ఆడిన 14 మ్యాచుల్లో విజయాలు 4 మాత్రమే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో జరిగే అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రోహిత్ విశ్రాంతి కోరడంతో.. ఈ సిరీస్ కు అతన్ని ఎంపిక చేయలేదు. ఇక జూన్ చివరలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు కోసం అతను మళ్లీ ఇండియా జట్టుతో కలుస్తాడు. మరి.. రితికా, రోహిత్ రొమాంటిక్ ఫోటోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Congratulations 🎉 @mipaltan!!!
I want to see Mumbai Indians as stronger in the next IPL season#IPL2022 #MumbaiIndians pic.twitter.com/xHvH1FrWvJ— Dinesh Lilawat (@ImDsL45) May 21, 2022