ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఇప్పటికే 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మెరుగైన రన్‌రేట్‌తో గెలిస్తే ప్లేఆఫ్ చేరుతుంది. దీంతో ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయర్లు గ్రీన్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఒక కాజ్ కోసం ఇలా గ్రీన్ కలర్ జెర్సీలో ఆడనున్నారు. దీనికి గో గ్రీన్ జెర్సీగా ఆర్సీబీ నామకరణం చేసింది. పచ్చదనాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఇవ్వడానికే జెర్సీని లేత ఆకుపచ్చ రంగులోకి మార్చుకున్నట్లు తెలిపింది.
ఐపీఎల్ అన్ని ఫ్రాంఛైజలకు చెందిన రాష్ట్రాల్లో గల చారిత్రక కట్టడాలను ఆకుపచ్చరంగులో డిజైన్ చేసిన ఫొటోలను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. రాజస్థాన్ రాయల్స్-జైపూర్ ప్యాలెస్, ఢిల్లీ కేపిటల్స్- ఢిల్లీ గేట్, కోల్‌కత నైట్‌రైడర్స్-విక్టోరియా ప్యాలెస్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- విధానసౌధ, పంజాబ్ కింగ్స్-గురుద్వారా, లక్నో సూపర్ జెయింట్స్-ఏక్ మినార్, గుజరాత్ టైటాన్స్- అక్షర్ ధామ్ మందిర్ వంటి చారిత్రక కట్టడాలకు చెందిన ఫొటో లేఅవుట్లు, గ్రీన్ జెర్సీని ధరించిన ప్లేయర్ల వీడియో క్లిప్పింగులను పోస్ట్ చేసింది. మరి ఆర్సీబీ గ్రీన్ జెర్సీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Daniel Sams: ఇన్ని రోజులు ముంబైకి భారంగా మారిన సామ్స్.. భారీ విజయాన్ని అందించాడు
From Red to Green, our boys are ready to #PlayBold for a cause. 👊🏼💚
How do you like our Green jersey, 12th Man Army? 🤩#WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #GoGreen #ForPlanetEarth pic.twitter.com/8AIvU6kDnf
— Royal Challengers Bangalore (@RCBTweets) May 7, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.