లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు.. యువ ఆటగాడు రజత్ పటీదార్ సెంచరీతో(112 నాటౌట్) అదరగొట్టడంతో 207 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సైతం.. గట్టిపోటీ ఇచ్చింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో చివరకి బెంగళూరు జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచులో.. సీజన్ అమాంతం పరుగులు చేయడంలో విరాట్ కోహ్లీ జట్టును కాస్త కాపాడే ప్రయత్నం చేశాడు. 24 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 25 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ కొట్టిని ఒక ఫ్లిక్ షాట్ కు.. గంగూలీ, జయ్ షా సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ డుప్లెసిస్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదార్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఈ దశలో దుష్మంత చమీర వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ మొదటి బంతిని ఎదుర్కొన్న కోహ్లి, మిడ్ వికెట్ దిశగా బౌండరీగా మలిచాడు. కోహ్లి కొట్టిన స్టైలిష్ బౌండరీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జే షా ఇద్దరూ సూపర్బ్ అంటూ ఎక్సప్రెషన్ ఇచ్చారు.
— Guess Karo (@KuchNahiUkhada) May 25, 2022
Reaction of Sourav Ganguly, When Virat Kohli played this shot❤️#ViratKohli • @imVkohli pic.twitter.com/7bkEDFIykn
— Viratians™ (@vira_tians) May 25, 2022
ఇది కూడా చదవండి: Virat Kohli: IPL 2022లో ఆ ప్రత్యేకమైన అవార్డును విరాట్ కోహ్లీకి ఇవ్వాల్సిందేనా?
కోల్‌కతా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు గంగూలీ జైషాతో కలిసి గ్యాలరీలో కూర్చొని ఎంజాయ్ చేశాడు. చమీర బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా కళ్లు చెదిరే బౌండరీ బాదాడు. దీనికి గంగూలీ.. ”వారెవ్వా క్యా షాట్ హై” అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తొలి పవర్ ప్లే ముగిసేసరికి ఆర్‌సీబీ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 52 పరుగులతో మంచి స్థితిలో నిలిచింది. పాటిదార్ 33 పరుగులతో కాస్త వేగంగా ఆడగా.. కోహ్లి అతనికి సహకరించాడు. ఆ తర్వాత 25 పరుగులు చేసిన కోహ్లి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇక.. ఆర్సీబీ మే27న క్వాలిఫయర్ 2 లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది.
We move forward together, one step at a time. 💪🏻
Next stop: Ahmedabad 📍✈️#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #LSGvRCB #PlayOffs pic.twitter.com/aBifGSI7WH
— Royal Challengers Bangalore (@RCBTweets) May 25, 2022
That feeling of breaking the Eliminator jinx. 🙌🏻💪🏻
Two steps away from making history: 🤞🏼#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #PlayOffs pic.twitter.com/CIMn46GSkU
— Royal Challengers Bangalore (@RCBTweets) May 26, 2022