ఐపీఎల్ 2022లో భాగంగా 22వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఇప్పటికే మూడు వరుస విజయాలతో ఆర్సీబీ మంచి జోరు మీద ఉంది. ఇక సీఎస్‌కే నాలుగు వరుస ఓటములతో ఢీలా పడ్డా.. తమదైన రోజున ఏ జట్టునైనా మట్టికరిపించే సత్తా సీఎస్‌కేకు ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో తెలుసుకోవాలంటే.. వారి బలాబలాలు పరిశీలిద్దాం..
ఆర్సీబీ..ఈ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతుల్యంతో ఉంది. ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ రాకతో బ్యాటింగ్ మరింత బలపడింది. అలాగే చివరి మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ తిరిగి ఫామ్ పుంజుకోవడంతో.. ఆర్సీబీ బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తుంది. ఓపెనర్లు డుప్లెసిస్, అనుజ్ రావత్ ఇద్దరూ మంచి టచ్‌లోనే ఉన్నారు. ఇక బౌలింగ్‌లో సిరాజ్ కొంత నిరాశ పరుస్తుండడం మైనస్. హసరంగా సూపర్ బౌలింగ్‌తో ఇతర బౌలర్ల వైఫల్యం కనిపించడంలేదు. ఇదే ప్రతి మ్యాచ్‌లో జరుగుతుందని చెప్పలేం. బౌలింగ్‌లో హసరంగాపైనే ఎక్కువగా ఆధారపడుతుండడం మైనస్.
చెన్నై సూపర్ కింగ్స్..ఐపీఎల్ చరిత్రలోనే తొలి సారి మొదటి నాలుగు మ్యాచ్‌లను ఓడి సీఎస్‌కే గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ఈ జట్టు అత్యంత దారుణంగా విఫలం అవుతుంది. ఎన్నో ఆశలతో రిటేన్ చేసుకున్న రుతురాజ్ గైక్వాడ్ దారుణం విఫలం అవుతున్నాడు. రాబిన్ ఊతప్ప తొలి రెండు మ్యాచ్‌లలో పర్వాలేదనిపించినా.. తర్వాత అంతగా ఆడలేదు. మొయిన్ అలీ చివరి మ్యాచ్‌లో బాగానే ఆడాడు. ఇక ధోని, రాయుడు, జడేజా, బ్రావో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోవడం ఆ జట్టుకు భారంగా మారింది. ఇక బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. అలాగే కెప్టెన్సీ మార్పు కూడా ప్రస్తుత జట్టు పరిస్థితికి ఒక కారణం.
పిచ్..
ఈ మ్యాచ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ చేసే అవకాశం ఉంది.
హెడ్ టూ హెడ్..
ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 28 మ్యాచ్‌లు జరిగాయి. అందులో 18 సీఎస్‌కే, 9 ఆర్సీబీ గెలుపొందాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఈ లెక్కల ప్రకారం ఆర్సీబీపై సీఎస్‌కే పైచేయిగా ఉంది.
ప్రిడిక్షన్..
ఇరుజట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించే అవకాశం ఉంది. సీఎస్‌కేలో ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం.. ఆర్సీబీ ప్లేయర్లు ఒక్కరొక్కరుగా ఫామ్‌లో రావడం.. బౌలింగ్ విభాగం స్ట్రాంగ్ ఉండడంతో ఆర్సీబీకి నాలుగో గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. ఆర్సీబీ బ్యాటర్లు వాళ్ల స్థాయి తగ్గట్లు ఆడితే విజయం నల్లేరుపై నడకే.
తుదిజట్ల అంచనా..
చెన్నై సూపర్ కింగ్స్.. జడేజా(కెప్టెన్), ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్, ధోని, మొయిన్ అలీ, రాయుడు, శివమ్ దూబే, బ్రావో, జోర్దాన్, ప్రిటోరియస్, ముఖేష్ చౌదరీ.
ఆర్సీబీ.. డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, అనుజ్ రావత్, మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, హసరంగా, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లే, సిరాజ్, ఆకాశ్ దీప్.
ఇదీ చదవండి: వీడియో వైరల్: అంపైర్ అయ్యావ్ కాబట్టి సరిపోయింది.. లేదంటే..?
DK and Bossman waiting for the 9 AM Game Day video like. 😉😄#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #CSKvRCB pic.twitter.com/ds2bsEZ9bj
— Royal Challengers Bangalore (@RCBTweets) April 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.