ఐపీఎల్ 2022లో ‘ఈ సాలా కప్ నమ్‌దే’ నినాదాన్ని నిజం చేసేందుకు ఆర్సీబీ మరో అడుగు ముందుకేసింది. బుధవారం జరిగిన ఏకైక ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను మట్టికరిపించింది. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడేందుకు రెండు జట్లు హోరాహోరీగా పోటీ పడ్డాయి. కానీ.. చివరికి ఆర్సీబీ విజయం సాధించి ఐపీఎల్ టైటిల్‌కు రెండు మ్యాచ్‌ల దూరంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో ఆర్సీబీ అద్భుత విజయం సాధించడంతో.. సోషల్ మీడియాలో ఆ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అభినందన పోస్టులతో సోషల్ మీడియాలో నిండిపోయింది. ఈ క్రమంలో ఆర్సీబీ అభిమానులు స్టేడియం బయట సంబురాలు చేసుకున్న ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది.
వందల సంఖ్యలో ఆర్సీబీ అభిమానులు స్టేడియం బయట రోడ్డుపై చేరి.. ఆర్సీబీ.. ఆర్సీబీ.. అంటూ నినాదాలు చేస్తూ.. ఆర్బీసీకి ఉన్న ఫ్యాన్ బేస్ పవర్‌ను మరోసారి చూపించారు. ఇప్పటికే ఐపీఎల్‌లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్నటీమ్ ఆర్సీబీకి గుర్తింపు ఉంది. పైగా సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్‌తో ప్రపంచలోనే నంబర్ 2 స్థానంలో నిలిచింది. అంతటి ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్‌కు ఒక్క ఐపీఎల్ ట్రోఫీలేకపోడం లోటే అయినప్పటికీ ఈ సారి ఆ లోటు తీరుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలిమినేటర్‌లో విజయం సాధించడంతో తమ అభిమాన జట్టు ఈ సారి కప్పు కొట్టడం ఖాయం అంటున్నారు. పైగా ఆ వీడియోను తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేస్తూ.. ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ బేస్ ఇది అని కాలర్ ఎగరేస్తున్నారు. కాగా ఈ వీడియో కోల్‌కత్తాది కాదని.. పాత వీడియో అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా ఒక సారి ఈ వీడియోనే వైరల్ అయిందని అంటున్నారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. మొహ్‌సిన్ ఖాన్ ఆర్సీబీని తొలి ఓవర్‌లోనే దారుణంగా దెబ్బతిశాడు. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్(0)ను తొలి ఓవర్ ఐదో బంతికి అవుట్ చేసి.. టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకున్న తన కెప్టెన్ నిర్ణయం సరైందే అని నిరూపించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ ఇన్సింగ్స్‌ను కొనసాగించాడు. కోహ్లీ నెమ్మదిగానే ఆడినా.. పటీదార్ మాత్రం ఎటాకింగ్ ప్లేతో లక్నో బౌలర్లకు చూక్కలు చూపించాడు. పటీదార్ 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో 112 పరుగులు చేసి అదరగొట్టాడు. దినేష్ కార్తీక్ 23 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్ 37 పరుగులు చేసి రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బౌలర్లలో మొహ్‌సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసుకున్నారు.
208 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన లక్నోను ఆర్సీబీ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తొలి ఓవర్‌లోనే దెబ్బకొట్టాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న క్వింటన్ డికాక్(6)ను తొలి ఓవర్‌లోనే అవుట్ చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 79 పరుగులు, దీపక్ హుడా 26 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సులతో 45 పరుగులు చేసి రాణించారు కానీ.. లక్నోకు విజయ తీరాలకు చేర్చలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లు 193 పరుగులు చేసి 14 రన్స్ తేడాతో ఓడింది. ఆర్సీబీ బౌలర్లలో హెజల్‌వుట్ 3, సిరాజ్, హసరంగా, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు. మరి లక్నోపై ఆర్సీబీ విజయం, ఫ్యాన్స్ సంబరాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: IPL 2022లో ఆ ప్రత్యేకమైన అవార్డును విరాట్ కోహ్లీకి ఇవ్వాల్సిందేనా?